Vijayawada, March 18: ఏపీలో పదో తరగతి విద్యార్థులకు (Tenth Class) అలర్ట్. టెన్త్ పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అధికారులు కొత్త షెడ్యూల్ (new schedule) విడుదల చేశారు. పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేశారు. పాఠశాల విద్యాశాఖ కొత్త పరీక్షా తేదీలను వెల్లడించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షలను (Inter Exams) మే 6 నుంచి నిర్వహిస్తున్నందున పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 2వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇదే సమయంలో ఇంటర్ పరీక్షలున్నాయి. దీంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసిన పాఠశాల విద్యాశాఖ తాజాగా కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది.
కొత్త పరీక్షల షెడ్యూల్ ఇదే..
ఏప్రిల్ 27న తెలుగు
ఏప్రిల్ 28న సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 29న ఇంగ్లీష్
మే 2న గణితం
మే 4న సైన్స్ పేపర్-1
మే 5న సైన్స్ పేపర్-2
మే 6న సాంఘిక శాస్త్రం
ఇంటర్ పరీక్షల (Inter Exams) షెడ్యూల్ లో కూడా మార్పు చేశారు. మారిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు మే 6 నుంచి 23 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరుగుతాయి. మే 7 నుంచి మే 24వ తేదీ వరకు సెకండియర్ పరీక్షలు జరుగతాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
జేఈఈ మెయిన్స్ (JEE Mains) రీ షెడ్యూల్ కారణంగా పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయని ఇంటర్ బోర్డు తెలిపింది. ఒకేసారి ఇంటర్, పది పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నపత్రాలకు పోలీసు బందోబస్తు, ఆరోగ్య సిబ్బంది, పరీక్ష కేంద్రాలు, ఇతరత్ర సమస్యలు ఏర్పడతాయని అధికారులు గుర్తించారు. కాగా, మొదటిసారిగా పదో తరగతి విద్యార్థులకు ఏడు పరీక్షలే నిర్వహిస్తున్నందున పరీక్ష, పరీక్షకు మధ్య ఒకటి, రెండు రోజులు విరామం ఇచ్చారు.