Vijayawada Doctor Family Died: విజయవాడలో వైద్యుడే కుటుంబ సభ్యులను హత్యచేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్థారించిన పోలీసులు, డాక్టర్ కుటుంబం అనుమానాస్పద మృతిపై కేసు నమోదు
Suicide Rep image (file Image)

Vjy, April 30: విజయవాడలోని గురునానక్‌ నగర్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.బాధిత కుటుంబం ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో డాక్టర్‌ శ్రీనివాస్‌, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలు ఉన్నారు. శ్రీనివాస్‌ కుంటుంబం మృతిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆయన కుటుంబానిది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీపీ రామకృష్ణ.. అక్కడ పరిశీలించారు. మృతులు డాక్టర్ శ్రీనివాస్ (40), భార్య ఉషారాణి (36), శైలజ (9), శ్రీహాన్(5), శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65)గా పోలీసులు గుర్తించారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులను హత్యచేసి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.  విజయవాడలో ఘోర విషాదం, ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి, ఆర్థిక ఇబ్బందులే కారణమా..

సంవత్సరం క్రితం శ్రీజ హాస్పిటల్ పేరుతో సొంతంగా హాస్పటల్ ఏర్పాటు చేశాడు. కొంతకాలం హస్పటల్ సక్రమంగా నిర్వహించాడు. తరువాత హాస్పటల్ నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. హాస్పిటల్ నిర్వహణ కోసం ఎదురు పెట్టుబడి పెడుతున్నాడు. కేవలం ఆర్థిక ఇబ్బందులు వల్లే చనిపోయాడని భావిస్తున్నాం. తల్లిని, భార్యను, ఇద్దరి పిల్లలను హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నాం’అని మృతుడి స్నేహితులు తెలిపారు.