Amaravati, Oct 18: వైసీపీ నేతలపై సన్నాసులు, ఎదవలు అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జనసైనికులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... తాను లండన్ లోనో, న్యూయార్క్ లోనో పెరగలేదని... బాపట్లలో పుట్టానని.. గొడ్డుకారం తిన్నానని పవన్ అన్నారు. వీధి బడిలో చదువుకున్నానని చెప్పారు.
వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో విరుచుకుడ్డారు. వెధవల్లారా, సన్నాసుల్లారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను స్కార్పియో కొన్నా కూడా వాళ్లిచ్చారా, వీళ్లిచ్చారా అని వైసీపీ నేతలు అంటుంటారని... ఒరేయ్ వెధవల్లారా నేనెంత సంపాదిస్తానో మీకు తెలుసురా? అని ప్రశ్నించారు.
గత 8 సంవత్సరాల కాలంలో తాను ఆరు సినిమాలు చేశానని... రూ. 100 కోట్ల నుంచి రూ. 120 కోట్ల రూపాయలను సంపాదించానని రూ. 33,37,04,776ల ట్యాక్స్ కట్టానని పవన్ చెప్పారు. ఇది జీఎస్టీ కాకుండా అని తెలిపారు. తన బిడ్డల పేరిట వేసిన ఫిక్స్ డ్ డిపాజిట్లను బ్రేక్ చేసి పార్టీ ఆఫీస్ పెట్టానని చెప్పారు. 2021-22 లో రూ. 5 కోట్లు పార్టీ ఫండ్ గా ఇచ్చానని తెలిపారు. హుదూద్ తుపాన్ దగ్గర నుంచి సైనిక్ బోర్డు, పీఎం కేర్ ఫండ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్, బూతులు తిట్టే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కూడా కలిపి దాదాపు రూ. 12 కోట్లు ఇచ్చానని చెప్పారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి రూ. 30 లక్షలు ఇచ్చానని తెలిపారు.
జనసేనకు ఐదు బ్యాంక్ ఖాతాలున్నాయని.. అందులో రూ. 17,58,06,323 కార్పస్ ఫండ్ ఉందని పవన్ చెప్పారు. కేవలం రైతు భరోసా కోసం రూ.3,50,78,226ల ఉందని చెప్పారు. మొన్న తన పుట్టిన రోజు కోసం జనసైనికులు చేయాలనుకున్న కార్యక్రమం కోసం వచ్చిన విరాళాలు రూ. 4,32,19,395లు అని వెల్లడించారు.
ప్యాకేజ్, ప్యాకేజ్ స్టార్ అనే సన్నాసి నా కొడు*లు ఎవరు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్క వైసీపీ నా కొడు*ని చెప్పు తీసుకుని కొడతా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పగిలిపోయేలా, దవడ వాచి పోయేలా అటు తిప్పి, ఇటు తిప్పి కొడతానని హెచ్చరించారు. తమాషాగా ఉందా కొడ**రా? అంటూ విరుచుకుపడ్డారు. ఇంకొకసారి ప్యాకేజీ అంటే చెప్పు తీసుకుని కొడతానని వార్నింగ్ ఇచ్చారు. పళ్లు రాలగొడతా కొడ**రా అంటూ హెచ్చరించారు. తన కాలికి ఉన్న చెప్పును చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు.
'అరేయ్ ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా... నా సహనమే ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. ఏరా వైసీపీ గూండాగాళ్లలారా.. మీ దగ్గర క్రిమినల్స్, గూండాలు ఉన్నారా... ఒంటి చేత్తో మెడ పిసికి తొక్కేస్తా' అని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసైనికులతో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు నిప్పులు చెరిగారు.
మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని అంటున్నారని... మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండిరా ఎవడొద్దన్నాడు? అంటూ వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. తొలి భార్యకు రూ. 5 కోట్ల డబ్బిచ్చానని, రెండో భార్యకు మిగతా ఆస్తి ఇచ్చానని, ఆ తర్వాత మూడో పెళ్లి చేసుకున్నానని, విడాకులు తీసుకుని పెళ్లి చేసుకున్నానని చెప్పారు. ఒక్క పెళ్లి చేసుకొని 30 మంది స్టెపినీలతో తిరిగే మీకేందిరా నేను చెప్పేది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చొక్కా పట్టుకుని ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతా కొడ..రా అని హెచ్చరించారు.
తాను కానిస్టేబుల్ కొడుకునని, ఐపీఎస్ ఆఫీసర్ కొడుకును కాదని... మాంచి ఇంగ్లీష్ తనకు రాదని, ముతక భాష వచ్చని... సంస్కారం ఉంది కాబట్టే ఇంత కాలం మూసుకుని ఉన్నానని పవన్ అన్నారు. మీకు మంచి పని చేయదని, శిక్షించడమే కరెక్ట్ అని చెప్పారు. వెధవలు అంటే వైసీపీలో ఉన్న అందరూ కాదని... బాలినేని శ్రీనివాస్, ఆనం రాంనారాయణరెడ్డి లాంటి మంచి వ్యక్తులు కూడా ఆ పార్టీలో ఉన్నారని అన్నారు. అలాంటి మంచి వ్యక్తులు కాకుండా బూతులు మాట్లాడే ప్రతి కొడు* చెపుతున్నా.. నుంచోబెట్టి తోలు ఒలుస్తా అందరికీ అని వార్నింగ్ ఇచ్చారు.
నాకు రాజకీయం తెలియదనుకున్నారా? అని ప్రశ్నించిన ఆయన... మీరు క్రిమినల్ పాలిటిక్స్ చేస్తారని, తాను బలమైన సిద్ధాంతాలతో కూడిన రాజకీయాలు చేస్తానని చెప్పారు. యుద్ధానికి సిద్ధమని మీరు చెపితే... రాళ్లా, హాకీ స్టిక్సా దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఎంతమంది వైసీపీ గూండా ఎమ్మెల్యే కొ**లు వస్తారో రండిరా ఛాలెంజ్ విసురుతున్నా అని అన్నారు. ఇప్పటి వరకు పవన్ మంచితనం, సహనం చూశారని... ఈరోజు నుంచి యుద్ధమేనని చెప్పారు.
ఇక బీజేపీతో పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో అలయెన్స్ ఉన్నప్పటికీ.. ఎక్కడో సరిగా లేదనే భావన కనపడుతోందని... ఆ విషయం తమకు తెలుసు, బీజేపీ నాయకత్వానికి కూడా తెలుసని ఆయన అన్నారు. రోడ్ మ్యాప్ అడిగింది బీజేపీతో కలిసి వెళ్లడానికేనని.. అయితే వారు మ్యాప్ ఇవ్వక పోవడం వల్ల తనకు సమయం గడిచిపోతుందని చెప్పారు.
తనకు పదవుల మీద వ్యామోహం లేదని... అయితే రౌడీలు రాజ్యాలు ఏలుతుంటే, గూండాలు గదమాయిస్తుంటే... ప్రజలను కాపాడుకోవడానికి తన వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తుందని అన్నారు. ప్రధాని మోదీకి కానీ, బీజేపీకి కానీ తాను వ్యతిరేకం కాదని చెప్పారు. బీజేపీని ఎప్పుడూ గౌరవిస్తామని... అలాగని ఊడిగం చేయలేమని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
వైసీపీలోని కాపు ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు ఊడిగం చేస్తూ కులాన్ని తక్కువ చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కావాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలని, మొత్తం కులాన్ని ఎందుకు తగ్గిస్తారని చెప్పారు. జగన్ ను పొగిడితే పొగుడుకోండి, కులాన్ని కించపరచొద్దని అన్నారు. తనకు కులం లేదని... అన్ని కులాలు బాగుండాలని కోరుకునే వ్యక్తినని తెలిపారు. వైసీపీ కాపు ఎమ్మెల్యేలకు పిచ్చిగా వాగొద్దని చెపుతున్నానని... కులం మీ వెంట రాదు అని మండిపడ్డారు. బంతి, కొట్టు సన్నాసుల్లారా నన్ను వివాదాల్లోకి లాగొద్దని అన్నారు.
తాను నక్సలైట్లు ఉండే ప్రాంతాల్లో కూడా పర్యటించానని చెప్పారు. ఉత్తారాంధ్ర ప్రాంతంలో తిరిగానని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తనతో కలసి రావాలని కోరారు. ఈ పోరాటంలో ముఖ్యమంత్రి పదవి వరిస్తే మంచిదేనని... సీఎం అయితే ముందు రాష్ట్రాన్ని బాగు చేసి, ఆ తర్వాత వైసీపీ గూండాల తాట తీస్తానని అన్నారు. భగవంతుడు ఆ అవకాశాన్ని ఇవ్వాలనే కోరుకుంటున్నానని చెప్పారు.