Perni Nani: నీ వారాహి బస్సుకు పసుపు రంగు వేసుకో, పవన్ లక్ష పుస్తకాలు కాకుండా ఆ పుస్తకం చదివుంటే రూల్స్ తెలిసేవంటూ పేర్ని నాని సెటైర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం ‘వారాహి’కి తెలుపు, నలుపు, మరో ఇతర రంగు కాకుండా పసుపు రంగు వేసుకుంటే సరిపోతుందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వ్యంగ్యోక్తులు విసిరారు.
VJY, Dec 9: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం ‘వారాహి’కి తెలుపు, నలుపు, మరో ఇతర రంగు కాకుండా పసుపు రంగు వేసుకుంటే సరిపోతుందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వ్యంగ్యోక్తులు విసిరారు. ఆయన గురువారం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. వారాహి వాహనానికి మిలటరీ వాహనాలకు మాత్రమే వేసే ఆలీవ్ గ్రీన్ రంగు వేశారని, ఇది చట్టవిరుద్ధమని చెప్పారు.
పవన్ కళ్యాణ్ వారాహి రథం రెడీ, బస్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసిన జనసేన అధినేత
ఆ వాహనాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయరన్నారు. లక్షల పుస్తకాలు చదివానని బీరాలు పలికే పవన్ ఇండియన్ మోటర్ వెహికల్ యాక్ట్ పుస్తకాన్ని చదివి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. సినిమాల్లో మిలటరీ డ్రస్ వేసుకుని, బోర్డర్‌లో పాకిస్థాన్ సైనికులను కాల్చి చంపినట్టు నటించవచ్చన్నారు. నిజజీవితంలో అలా ఉండదన్నది గుర్తుంచుకోవాలని హితవు పలికారు. డబ్బులున్న ప్రతి ఒక్కరూ వ్యాన్లుకొని యుద్ధం చేస్తామంటే కుదరదన్నారు.
పవన్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు అయితే ఇవన్నీ తెలిసేవని, కాల్‌షీట్ పొలిటీషియన్ కావడంవల్లే చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు మినహా ఏమీ తెలియవని అన్నారు. విశాఖలో ప్రధాని మోదీ పలకరించకపోతే ఈపాటికే చంద్రబాబుతో పవన్ జతకలిసే వాడన్నారు. ఎన్నికలకు ముందు ఎప్పుౖడెనా బాబుతో పవన్ జతకలవడం ఖాయమన్నారు. అందుకే వాహనానికి పసుపు రంగు వేస్తే డబ్బులు మిగులుతాయని చెప్పారు.
(The above story first appeared on LatestLY on Dec 09, 2022 05:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

