![](https://test1.latestly.com/uploads/images/2024/11/ys-jagan-mohan-reddy.jpg?width=380&height=214)
Vjy, Feb 13: బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్త తరపున చంద్రబాబుకు చెబుతున్నా... మళ్లీ వచ్చేది జగన్ 2.0 పాలన. అన్యాయాలు చేసే వారెవరినీ వదిలిపెట్టేది లేదు. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతాం. కార్యకర్తలకు అన్నలా ఉంటా..’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) భరోసానిచ్చారు.
జగన్ 1.0 పాలనలో అధికారంలోకి వచ్చిన 9 నెలలు కాకమునుపే ఎప్పుడూ చూడని విధంగా కోవిడ్ పరిస్థితుల మధ్యే కాలం గడిపాం. తర్వాత రెండున్నర సంవత్సరాలు కోవిడ్ మధ్యే ఉన్నాం. ఆ టైంలో ప్రజలకు ఎలా తోడుగా ఉండాలనే తపనతో అడుగులు వేశాం. అందుకే కార్యకర్తలకు చేయదగినంత చేయలేకపోయాం. ఈసారి జగన్ 2.0లో ప్రజలకు తోడుగా ఉంటూ.. కార్యకర్తలకు అండగా, వారి ఇంటికి అన్నలా ఉంటా. మార్చి నాటికి స్థానిక సంస్థలకు నాలుగేళ్ల పదవీ కాలం ముగియబోతుంది.
తమ వాళ్లను పదవుల్లో కూర్చోబెట్టడానికి ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ప్రయత్నిస్తారు. మన వాళ్లను భయపెట్టడానికి, లొంగదీసుకోవడానికి, ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ ఉన్నా మనం ధైర్యంగా ఉండాలి. ఎల్లకాలం ఇలా ఉండదు. చీకటి తర్వాత వెలుతురు రాక మానదు. రానున్న మూడు సంవత్సరాలు మన క్యారెక్టర్‌ను కాపాడుకుందాం. మన విలువలు కాపాడుకుందాం. ఆ తర్వాత రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తామని జగన్ అన్నారు.