
Amaravati, Jan 7: టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు (Chandrababu on Alliance) చేశారు. గత ఎన్నికల ఫలితాలకు, పొత్తులకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. పొత్తులపై వైసీపీ నేతలు (YCP Leaders) పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. తమ పార్టీ గతంలో పలు పార్టీలతో పొత్తులు పెట్టుకుని గెలిచిందని, అలాగే పొత్తులు లేకుండా కూడా గెలిచిందని ఆయన తెలిపారు.
ఒక్కోసారి పొత్తులు పెట్టుకున్నప్పటికీ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. పొత్తులు అనేవి రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయని తెలిపారు. ప్రస్తుతంలో ఏపీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అందరూ కలవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సీఎం జగన్ ఏపీని సర్వనాశనం చేశారని ఆయన అన్నారు. జగన్ విధ్వంసక పాలన పోవాలంటే ధర్మ పోరాటం చేయాలని ఆయన అన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆయన (TDP President Chandrababu Naidu) పిలుపునిచ్చారు.
రాష్ట్రం వైసీపీ జాగీరా? మీకు రాష్ట్రాన్ని రాశిచ్చారా? అయిదేళ్లు చరిత్రలో నిలిచిపోయేలా పరిపాలించాలి.. జగన్ రాష్ట్ర వినాశకారుడిగా మారాడు. నేను కుప్పం వదిలి ఎందుకు వెళ్లాలి? వీళ్లకు భయపడుతాననుకుంటున్నారా?’’ అంటూ ధ్వజమెత్తారు. తానొక విజన్‌తో రాష్డ్రాన్ని అభివృద్ది చేస్తే.. వైసీపీ అధికారంలోకి వచ్చి నాశనం చేసిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులకు... సంక్షేమ పధకాలకు సంబంధం ఉందా? అని ప్రశ్నించారు.
వైసీపీ కార్యకర్తల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు. కుప్పం నుంచే ఈ అరాచక పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిస్తున్నానన్నారు. ఎన్నికల కోసం తాను కుప్పం రాకున్నా ఏడుసార్లు ప్రజలు గెలిపించారని.. వాళ్లతో తనది భావోద్వేగపూరిత అనుబంధమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు.
ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) మండిపడ్డారు. చంద్రబాబు ఒక అవకాశవాదని, అవసరమైనప్పుడు ఎవరినైనా లవ్ చేస్తాడంటూ సోము వీర్రాజు ధ్వజమెత్తారు.‘చంద్రబాబు అవకాశవాది. ఎవరినైనా లవ్‌చేస్తాడు. తర్వాత వదిలేస్తాడు. అవసరమైనప్పుడు లవ్ చేయడంలో చంద్రబాబు సమర్ధుడు.1996లో కాంగ్రెస్‌లో చంద్రబాబు చక్రం తిప్పాడు అప్పటి నుంచి అన్ని పార్టీలను లవ్ చేశాడు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు సోము వీర్రాజు.