Tadepalli, July 16: ఎన్నికల ముందు తమపై ఏ విధంగా విషం చిమ్మారో, ఇప్పుడు కూడా టీడీపీ, దాని మిత్ర పక్షాలు అదే రీతిలో వ్యవహరిస్తున్నాయని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani Slams Chandrababu) ధ్వజమెత్తారు. బట్ట కాల్చి ముఖంపై వేసే వైఖరిని ఇంకా కొనసాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి పాలన 30 రోజులు పూర్తయ్యిందని, తన అంత అనుభవజ్ఞుడు లేడని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన (YSRCP Leader Perni Nani) మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో కూటమి పాలన (Chandrababu Govt) 30 రోజులు పూర్తయ్యింది. ఈ 35 రోజుల్లో చంద్రబాబు ఏం అడుగులు వేశారో చెప్పాలి. ఈ 35 రోజుల్లో పెన్షన్ డబ్బులు ఇవ్వడం తప్ప మరో పని చేయలేదు. జగన్‌ను దూషించటం తప్ప ఒక్క పని కూడా చేయలేదు. కాలక్షేపం కోసం శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. శ్వేతపత్రం విడుదల చేయడం తప్ ఒక్కటైనా నిరూపించారా? ఎన్నికల్లో చంద్రబాబు మాటలు కోటలు దాటాయి. ప్రజల కోసం చంద్రబాబు చేసిందేమి లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆమోదం, జులై 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఏపీ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో..
పోలవరం ప్రాజెక్టు 70 శాతం మీరే కట్టారని చెప్తున్నారు. మిగతా 30 శాతం ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నిస్తే సమాధానం లేదు. అమరావతి అంతా తిరిగారు. ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పరు. విద్యుత్ శాఖపై కూడా శ్వేతపత్రం ఇచ్చారు. వైఎస్ జగన్ మీద అబద్ధాలతో శ్వేత పత్రం విడుదల చేశారు.
Here's Videos
సంపద సృష్టిస్తానని బాబు అనుభవం ఏమైంది
బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది.. ఖజానాలో రూ. 100 కోట్లు ఉంచి 2019 లో మీరు అధికారంలో నుంచి దిగిపోయారు..అయినా @ysjagan గారి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది.
-పేర్ని నాని గారు, మాజీ మంత్రి pic.twitter.com/3LKpRaiSB8
— YSR Congress Party (@YSRCParty) July 16, 2024
.@ncbn కాలక్షేపం కోసమే శ్వేతపత్రలు రిలీజ్ చేస్తున్నాడు.. తన 35 రోజుల పాలన వైయస్ జగన్ గారిని వ్యక్తిగతంగా తిట్టటానికే సరిపోయింది ..జనాలకు చేసింది ఏమి లేదు.
-పేర్ని నాని గారు, మాజీ మంత్రి pic.twitter.com/zzWQdLBYpR
— YSR Congress Party (@YSRCParty) July 16, 2024
చెత్త మీద పన్ను వసూలు చేస్తారా చెత్త ప్రభుత్వం అని మాట్లాడారు.. ఇప్పుడు రోజుకి 3 రూపాయలు చొప్పున నెలకు 90 రూపాయలు వసూలు చేస్తున్న మిమ్మల్ని ఏమనాలి మరి @PawanKalyan?
-పేర్ని నాని గారు, మాజీ మంత్రి pic.twitter.com/RuiQiFIna7
— YSR Congress Party (@YSRCParty) July 16, 2024
విద్యుత్ ఛార్జీలు తగ్గిద్దామని పవన్ కల్యాణ్ కూడా చెప్పారు. కరెంట్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు చెప్పారు. మళ్లీ విద్యుత్ ఛార్జీలపై చంద్రబాబు మాట మర్చేశారు. జగన్‌పై బాదుడే బాదుడే అంటూ అసత్య ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చి 35 రోజులైంది.. చెత్త పన్ను ఆపారా?. జగన్ అధికారంలో ఉన్నప్పుడు చెత్తపన్ను విధిస్తే విమర్శించారు. చెత్త పన్ను కొనసాగిస్తున్న మిమ్మల్ని ఏమనాలి?.. మైనింగ్‌పై అబద్ధాలతో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. మైన్స్‌లో మీకంటే రెండు రెట్లు ఎక్కువ ఆదాయం వైఎస్ జగన్ సమకూర్చారు. నాలుగు అసత్యాలు.. పది అబద్ధాలతో చంద్రబాబు శ్వేత పత్రం ఉంది.
బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఇదేనా మీ అనుభవం.. ఇంతకుమించి అని చేయలేరా? ఎన్నికల్లో మాత్రం జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామన్నారు. సంపద సృష్టించి అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పుడు ఖజానా డబ్బులు లేవని మాట్లాడుతున్నారు. బాబు సీఎం అయ్యే 48 గంటల ముందు కేంద్రం రూ. 5,600 కోట్లు ఇచ్చింది’ అని అన్నారు.
ఎంతో అనుభవం ఉందని మీరు చెప్పుకుంటున్నారు కదా... ఊరికే భూములు దోచుకున్నారని అనడం కాదు... మీలో ఖలేజా ఉంటే... ఆధారాలను ఈ సమాజం ముందు పెట్టండి అని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఏ దళితుల భూమిని ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి బదలాయించుకున్నాడో చెప్పాలి కదా అని నిలదీశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ శాఖ మీవే కదా... అధికారంలో ఉన్నది మీరే కదా... ఎందుకు నిరూపించలేకపోతున్నారు? అంటూ పేర్ని నాని మండిపడ్డారు.
అధికారం కోసం ఐదు పదుల వయసున్న కుర్రాడితో పోటీ పడి, ఆ కుర్రాడ్ని నాశనం చేయడం కోసం విషం చిమ్మే దిక్కుమాలిన మార్గం ఎంచుకున్నారు అంటూ విమర్శించారు. అలవికాని హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయలేక ఈ 35 రోజుల్లో దిక్కులు చూడడం తప్ప మీరు చేస్తున్నదేంటి? అని పేర్ని నాని ప్రశ్నించారు.