Chittoor, August 7: చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. పుంగనూరు పోలీసులపై దాడి కేసులో మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మొత్తం ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 72కు చేరుకుంది.
పథకం ప్రకారమే పోలీసులపై దాడి, పుంగనూరు ఉద్రికత్తలపై స్పందించిన చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి
A1 ముద్దాయి అయిన పుంగనూరు టీడీపీ ఇంఛార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. అతని కోసం ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. దాడి జరిగిన రోజు ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో చెక్ పోస్ట్, టోల్ గేట్ వద్దనున్న సీసీ కెమెరాలు ద్వారా వాహనాలు నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.