Amaravati, May 11: ఏపీలో గడచిన 24 గంటల్లో 86,878 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,345 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,426 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 2,371 కేసులు, అనంతపురం జిల్లాలో 1,992 కేసులు, గుంటూరు జిల్లాలో 1,919 కేసులు గుర్తించారు.
అదే సమయంలో 14,502 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా, 108 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో నిన్న తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో మరణించిన వారు కూడా ఉన్నారు. ఇక, ఏపీలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,22,934కి పెరిగింది. ఇప్పటివరకు 11,18,933 మంది కరోనా నుంచి విముక్తులు కాగా, ఇంకా 1,95,102 మంది చికిత్స పొందుతున్నారు.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 18 మంది మరణించగా, విశాఖపట్నంలో 12 మంది, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పున మరణించారు. ప్రకాశంలొ తొమ్మది, నెల్లూరు 8, కృష్ణాలో 7, శ్రీకాకుళంలో 6 మంది మరణించారు. అలాగే కర్నూలు, వెస్ట్ గోదావరిలో అయిదుగురు చొప్పున మరణించారు. కడప జిల్లాలో ముగ్గురు చొప్పున మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 8,899కి పెరిగింది.
Here's AP Covid Report
#COVIDUpdates: As on 11th May 2021 10:00 AM
COVID Positives: 13,20,039
Discharged: 11,16,038
Deceased: 8,899
Active Cases: 1,95,102#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/ksAJWTQivg
— ArogyaAndhra (@ArogyaAndhra) May 11, 2021
కరోనాతో (Coronavirus) కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ఉన్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. బాధాకరమైన ఘటనలు కూడా జరుగుతున్నాయని.. నిన్న రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన తీవ్రంగా కలచి వేసిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం (AP CM YS jagan) ప్రకటించారు. మనం ఎంత కష్టపడుతున్నా, ప్రయత్నాలు చేస్తున్నా కూడా కొన్ని కొన్ని మన చేతుల్లో లేని అంశాలకు కూడా మనం బాధ్యత వహించాల్సి వస్తోందన్నారు.