Amaravat, Mar 8: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 25,907 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా... వారిలో 74 మందికి పాజిటివ్ గా (Andhra Pradesh Coronavirus) నిర్ధారణ అయింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 13 మందికి కరోనా పాజిటివ్ (Coronavirus) వచ్చింది. ఇదే సమయంలో అనంతపురం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరోవైపు ఇదే సమయంలో గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చెప్పున కరోనా వల్ల మరణించారు.
గత 24 గంటల్లో 61 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,90,766 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 8,82,581 మంది కోలుకోగా... 7,176 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,009 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 1,42,62,086 మంది శాంపిల్స్ ని పరీక్షించారు.
భారత్‌లో గత 24 గంటల్లో 18,599 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను (India Covid Updates) కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 14,278 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,29,398కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 97 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,853కు పెరిగింది.
తెలంగాణలో 18 మందికి యుకె కరోనా స్ట్రెయిన్, రాఫ్ట్రంలో తాజాగా 111 మందికి కరోనా
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,82,798 మంది కోలుకున్నారు. 1,88,747 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 22,19,68,271 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 5,37,764 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.