Coronavirus | Representational Image (Photo Credits: ANI)

Amaravati, August 2: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 59,641 పరీక్షలు నిర్వహించగా.. 1,546 కేసులు నిర్ధారణ (Corona In Andhra pradesh) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,67,113 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,410కి (Covid Deaths) చేరింది.

24 గంటల వ్యవధిలో 1,968 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,33,121కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,582 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,47,08,540 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. కొవిడ్‌ వల్ల చిత్తూరు జిల్లాలో అయిదుగురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, కృష్ణలో ముగ్గురు,ప్రకాశం జిల్లాలో ముగ్గురు, గుంటూరు, శ్రీకాకుళంలొ ఒకరు చొప్పున మరణించారు. రెండు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలి, ఆర్టీపీసీఆర్‌ టెస్టులు మాత్రమే చేయండి, కోవిడ్ సమీక్షలో అధికారులతో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి

తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం కోవిడ్‌ నియంత్రణ, వైద్యరంగంలో నాడు-నేడుపై సమీక్ష చేపట్టారు. సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 45 ఏళ్లకు పైబడ్డవారు, గర్భవతుల తర్వాత టీచర్లకు వ్యాక్సినేషన్‌లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Here's AP Covid Report

ఆగస్టు 16వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని తెలిపారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. ఎక్కడా కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడకుండా చూడాలని సూచించారు.