ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 85,856 పరీక్షలు నిర్వహించగా.. 2,287 కేసులు నిర్ధారణ (Corona In Andhra pradesh) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,65,567 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,395కి (Covid Deaths) చేరింది.
24 గంటల వ్యవధిలో 2430 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,31,153కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,019 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,46,48,899 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. కొవిడ్ వల్ల తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో నలుగురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, కృష్ణలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, గుంటూరు, కర్నూలు, పశ్చిమ గోదావరిలో ఒకరు చొప్పున మరణించారు.
దేశవ్యాప్తంగా గర్భిణులకు జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే 20 లక్షల మంది తల్లులకు (ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు) వ్యాక్సిన్ వేశారు. అంతేకాదు రెండు కోట్ల డోసులు వేసిన 10 రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎక్కువ మంది గర్భిణులకు వ్యాక్సిన్ వేసిన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది.
Here's AP Covid Report
#COVIDUpdates: As on 01st August 2021 10:00 AM
COVID Positives: 19,65,567
Discharged: 19,31,153
Deceased: 13,395
Active Cases: 21,019#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Sc1omWVfzd
— ArogyaAndhra (@ArogyaAndhra) August 1, 2021
జూలై 30 రాత్రికి కేంద్రం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. 78,838 మంది గర్భిణులకు వ్యాక్సిన్ వేసి తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, 34,228 మందికి వేసి ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ఒడిశాలో 29,821 మందికి, మధ్యప్రదేశ్‌లో 21,842, కేరళలో 18,423 మంది గర్భిణులకు వ్యాక్సిన్ వేశారు. గర్భిణులు వ్యాక్సిన్‌కు వెళ్లినప్పుడు కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ ఏది కోరుకుంటే అది వేయాలని వ్యాక్సిన్ నోడల్ అధికారి చెప్పారు.