Corona in AP: ఏపీలో పెరుగుతున్న డిశ్చార్జ్ రేటు, తగ్గుతున్న కేసులు, తాజాగా 2,925 మందికి కోవిడ్, 3,937 మంది బాధితులు కోలుకుని క్షేమంగా ఇంటికి, ప్రస్తుతం రాష్ట్రంలో 29,262 యాక్టివ్‌ కేసులు
Coronavirus test (Photo-ANI)

Amaravati, july 10: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 95,366 పరీక్షలు నిర్వహించగా.. 2,925 కేసులు నిర్ధారణ (Corona in AP) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,20,178 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 26 మంది బాధితులు (26 deaths in 24 hours) ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,986కి చేరింది.

24 గంటల వ్యవధిలో 3,937 మంది బాధితులు ( 3,937 recoveries) కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,77,930కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,262 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,28,94,611 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున ప్రాణాలో కోల్పోయారు.

చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు మృతి చెందారు. అలాగే కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కడప, ప్రకాశం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.