Coronavirus in India (Photo Credits: PTI)

Amaravati, Mar 4: ఏపీలో గడచిన 24 గంటల్లో 45,077 కరోనా పరీక్షలు నిర్వహించగా 102 మందికి కరోనా పాజిటివ్ (AP Covid Update) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 25 పాజిటివ్ కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 22 కేసులు వెల్లడయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 56 మంది కరోనా నుంచి కోలుకోగా, చిత్తూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 8,90,317 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,275 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 871 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మరణాల సంఖ్య 7,171కి చేరింది.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ (హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లు) (YSR Health Clinics) ఏర్పాటు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సుమారు 7,400 పీహెచ్‌సీ సబ్‌సెంటర్లు ఉండేవి. అవి కూడా 90 శాతం అద్దె భవనాల్లో కునారిల్లుతుండేవి. వాటి సంఖ్యను 10,011కు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం 8,585 హెల్త్‌ క్లినిక్స్‌కు (YSR Health Centers) సొంత భవనాలను సమకూరుస్తోంది.

దేశంలో మళ్లీ ఒక్కసారిగా పెరిగిన కేసులు, తాజాగా 17,407 మందికి కరోనా పాజిటివ్, 24 గంటల్లో 89 మంది మృతి, కోవిడ్ పెరుగుదలతో వణుకుతున్న ఆరు రాష్ట్రాలు

పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో వీటి నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,692 కోట్లు కేటాయించింది. ఇప్పటికే 641 భవనాల నిర్మాణం పూర్తికాగా.. 803 భవనాలు స్లాబ్‌ దశ దాటాయి. మరో 4,031 భవనాలు పిల్లర్స్‌ దశకు రావాల్సి ఉంది. ఈ నెలాఖరు నాటికి 848 భవనాలను, జూన్‌ నాటికి మరో 4,531 భవనాలను, సెప్టెంబర్‌ నాటికి 3,206 భవనాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇవి పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.