Coronavirus | Representational Image (Photo Credits: ANI)

Amaravati, August 31: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 52,319 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,115 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 19 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,857 కు చేరింది. గత 24 గంటల్లో 1,265 మంది ( recoveries) కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 19,85,566 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 14,693 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,14,116 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,66,29,314 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 210 కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 165 కేసులు నమోదయ్యాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో125 కేసులు నమోదు కాగా నెల్లూరు జిల్లాలో 120, ప్రకాశం జిల్లాలో 121 కేసులు నమోదయ్యాయి.

ఇది థర్డ్ వేవ్ హెచ్చరికేనా..రాష్ట్రాల్లో పెరుగుతున్నకరోనా కేసులు, దేశంలో తాజాగా 30,941 పాజిటివ్ కేసులు న‌మోదు, 350 మంది మృతి

కోవిడ్ తో గత 14 గంటల్లో చిత్తూరులో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, కృష్ణా జిల్లాలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, విశాఖ, పశ్చిమ గోదావరిలో ఒకరు చొప్పున మరణించారు.

గత 24 గంటల్లో కేసులు వివరాలు

అనంతపూర్ - 21

చిత్తూరు - 210

తూర్పుగోదావరి - 74

గుంటూరు - 121

కడప - 36

కృష్ణా - 165

కర్నూలు - 9

నెల్లూరు - 120

ప్రకాశం - 121

శ్రీకాకుళం - 50

విశాఖపట్నం - 48

విజయనగరం - 15

పశ్చిమగోదావరి - 125