Coronavirus in AP: నెల్లూరు, చిత్తూరులో మళ్లీ పెరిగిన కేసులు, ఏపీలో తాజాగా 1,178 మందికి కరోనా, గత 24 గంటల్లో 1,266 మంది డిశ్చార్జ్, రాష్ట్రంలో ప్రస్తుతం 14,452 యాక్టివ్‌ కేసులు
Coronavirus | Representational Image (Photo Credits: ANI)

Amaravati, Sep 7: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 54,790 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,178 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 11 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,935 కు చేరింది. గత 24 గంటల్లో 1,266 మంది ( recoveries) కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 19,91,960 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 14,452 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,23,242కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,70,37,651 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1204 కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 151 కేసులు నమోదయ్యాయి. ఇక నెల్లూరు జిల్లాలో 177 కేసులు నమోదు కాగా గుంటూరు జిల్లాలో 135, ప్రకాశం జిల్లాలో 118 కేసులు నమోదయ్యాయి.

తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తే జవాబుదారీతనం ఉంటుంది, విద్యాదీవెన, ఇంటర్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్లపై రివ్యూ పిటిషన్ వేస్తాం, మీడియాతో విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్

కోవిడ్ తో గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు,పశ్చిమ గోదావరి జిల్లాలో లో ఒకరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు, విశాఖలో ఒకరు చొప్పున మరణించారు.

గత 24 గంటల్లో కేసులు వివరాలు

అనంతపూర్ - 17

చిత్తూరు - 204

తూర్పుగోదావరి - 72

గుంటూరు - 135

కడప - 15

కృష్ణా - 151

కర్నూలు - 34

నెల్లూరు - 177

ప్రకాశం - 118

శ్రీకాకుళం - 48

విశాఖపట్నం - 74

విజయనగరం - 9

పశ్చిమగోదావరి - 124