Corona in AP: చిత్తూరు జిల్లాలో పెరిగిన కేసులు, ఏపీలో తాజాగా 1,190 మందికి కరోనా, గత 24 గంటల్లో 1,226 మంది డిశ్చార్జ్, రాష్ట్రంలో ప్రస్తుతం 15,110 యాక్టివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 45,533 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,190 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 11 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు.

Corona in AP: చిత్తూరు జిల్లాలో పెరిగిన కేసులు, ఏపీలో తాజాగా 1,190 మందికి కరోనా, గత 24 గంటల్లో 1,226 మంది డిశ్చార్జ్, రాష్ట్రంలో ప్రస్తుతం 15,110 యాక్టివ్ కేసులు
Coronavirus-in-India ( photo-PTI)

Amaravati, Sep 12: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 45,533 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,190 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 11 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,998 కు చేరింది. గత 24 గంటల్లో 1,226 మంది ( recoveries) కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 20,00,877మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 15,110 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,27,090కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,73,24,995 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 219 కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 117 కేసులు, కృష్ణా జిల్లాలో 164 కేసులు నమోదయ్యాయి. ఇక నెల్లూరు జిల్లాలో 139 కేసులు నమోదు కాగా ప్రకాశం జిల్లాలో 121, పశ్చిమ గోదావరి జిల్లాలో 114 కేసులు నమోదయ్యాయి.

దేశంలో కొత్తగా 28,591 కేసులు నమోదు, 338 మంది కరోనాకు బలి, కోవిడ్‌ నిర్వహణ, వ్యాక్సినేషన్, పెరుగుతున్న కేసులపై సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ

కోవిడ్ తో గత 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు,ప్రకాశం జిల్లాలో లో ఇద్దరు, విశాఖ జిల్లాలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు చొప్పున మరణించారు.

గత 24 గంటల్లో కేసులు వివరాలు

అనంతపూర్ - 19

చిత్తూరు - 219

తూర్పుగోదావరి - 83

గుంటూరు - 117

కడప - 69

కృష్ణా - 164

కర్నూలు - 10

నెల్లూరు - 139

ప్రకాశం - 121

శ్రీకాకుళం - 48

విశాఖపట్నం - 65

విజయనగరం - 22

పశ్చిమగోదావరి - 114

(The above story first appeared on LatestLY on Sep 12, 2021 04:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).