Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మరో 1813 పాజిటివ్ కేసులు నమోదు, ఒక్కరోజులోనే మరో 17 మంది మృతి, రాష్ట్రంలో 27 వేలు దాటిన మొత్తం కొవిడ్19 బాధితుల సంఖ్య
COVID-19 | (Photo Credits: IANS)

Amaravati, July11: ఆంధ్రప్రదేశ్‌లో మరోరోజు కూడా భారీ స్థాయిలోనే కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా మరో 813 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 27,235 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 24,442 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 20,590 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా మరో 17 కరోనా మరణాలు నమోదయ్యాయి.   తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 309 కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 1168మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 14,393 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 12,533 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

AP COVID19 Report: 

status of positive cases of #COVID19 in Andhra Pradesh

ఇక కరోనా నివారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రతి జిల్లాకి కోటి రూపాయలు కేటాయించింది. ఈ మొత్తాన్ని వైద్య పరికరాలు, సౌకర్యాలకు వాడతారు, వాటి కేంద్రాలను జేసీలు పర్యవేక్షిస్తారు అని

కొవిడ్ నియంత్రణ నోడల్' అధికారి కృష్ణ బాబు తెలిపారు.

అలాగే #Quarantine సెంటర్స్ లలో పడకల సంఖ్య 5 వేలకు పెంచాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. #COVID19 బాధితుల ఆహరం కోసం మనిషికి రోజుకు రూ. 500/ కేటాయిస్తున్నట్లు తెలిపారు, పనితీరు సరిగాలేని కేంద్రాల బాధ్యులకు క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన వెల్లడించారు.