Coronavirus-in-India ( photo-PTI)

Amaravati, july 28: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 70,695 పరీక్షలు నిర్వహించగా.. 2,010 కేసులు నిర్ధారణ (Corona In Andhra pradesh) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,59,942 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 20 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,312కి చేరింది.

24 గంటల వ్యవధిలో 1,956 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,25,631కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,999 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,43,24,626 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.కొవిడ్‌ వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, కృష్ణలో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, గుంటూరు, వైయస్సార్ కడప, కర్నూలు, శ్రీకాకుళంలో ఒకరు చొప్పున మరణించారు.

రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతున్న డెల్టా వేరియంట్, అమెరికాలో హైఅలర్ట్, తప్పనిసరిగా మాస్క్‌లు ధ‌రించాల‌ని ఆ దేశ ఆరోగ్య‌శాఖ ఆదేశాలు, రెండు డోసులు తీసుకున్న వారిని సైతం వదలని డెల్టా

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కరోనా వైరస్‌ (Coronavirus)) నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. థర్డ్ వేవ్‌ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఆయన (CM Jagan) మాట్లాడుతూ.. ‘‘కాన్సన్‌ట్రేటర్లు, డీటైప్‌సిలెండర్లు, ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణపై శ్రద్ధవహించాలి. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఉంచాలి. జిల్లాల వారీగా వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి. ఏపీఎంఎస్‌ఐడీసీలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేయాలి’’ అని అధికారులను ఆదేశించారు.