Coronavirus Cases in India (Photo Credits: PTI)

Amaravati, Nov 5: ఏపీలో గత 24 గంటల్లో 74,465 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..2,477 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా (AP Covid Report) నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,33,208కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. తాజాగా కరోనా (COVID-19) నుంచి కొత్తగా 2,701 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 8,05,026 గా ఉంది.

గత 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,744కు (COVID-19 Deaths) పెరిగింది. ప్రస్తుతం ఏపీలో 21,438 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 83,42,265 మందికి సాంపిల్స్‌ పరీక్షించడం జరిగింది.

శీతాకాలంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) పొంచి ఉందని.. కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని డాక్టర్లు చెబుతున్నారు.భారత దేశంలో గత రెండు మూడు నెలల కంటే కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, సామాజిక దూరం పాటించాలన్నారు.

ఢిల్లీలో మూడవ దశకు చేరుకున్న కరోనా, రోజు రోజుకు పెరుగుతున్న కేసులు, అలర్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, 4 లక్షలు దాటిన కేసులు

కరోనా రోగుల్లో ఊపిరితిత్తులు ఎందుకు దెబ్బ తింటున్నాయనే ప్రశ్నకు బ్రిటన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు సమాధానాన్ని కనుగొన్నారు. కొంతమంది కొవిడ్‌ రోగుల్లో నెలల తరబడి ఇన్ఫెక్షన్‌ లక్షణాలు తగ్గకుంటే ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతినే ముప్పు పొంచి ఉంటుందని తాజా అధ్యయనంలో గుర్తించారు. వైరస్‌ పాగా వేయడంతో.. శ్వాసకోశ కణజాలం కాస్తా ఫైబ్రోటిక్‌ మెటీరియల్‌గా రూపాంతరం చెందిందన్నారు.

ధమనులు, సిరల్లో రక్తం గడ్డకట్టే సమస్యకు.. ఊపిరితిత్తుల్లోని కొన్ని కణాలు బహుళ కేంద్రకాలతో సాధారణ కంటే పెద్ద పరిమాణంలోకి మారడానికి ఇన్ఫెక్షనే కారణ భూ తమైందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్‌తో మృతిచెందిన 41 మంది కొవిడ్‌ రోగుల గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీ కణజాలాల శాంపిళ్లను పరీక్షించగా ఈవిషయాలు వెలుగుచూశాయని వెల్లడించారు.