Amaravati, July 13: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 81,763 పరీక్షలు నిర్వహించగా 2,567 కేసులు (Coronavirus in Andhra Pradesh ) నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,26,988 మంది వైరస్ (COVID in Andhra) బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,042కి చేరింది.
24 గంటల వ్యవధిలో 3,034 మంది బాధితులు కోలుకోవడంతో (3,034 recoveries) రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,87,236కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,710 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,31,30,708 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లాలో కరోనాతో నలుగురు మృతి చెందగా, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. అలాగే విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కొత్త కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న 31,443 కరోనా కేసులు నమోదయ్యాయని, దేశంలో 118 రోజుల కనిష్ఠానికి రోజు వారీ కేసులు చేరాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రికవరీ రేటు 97.28 శాతంగా ఉందని పేర్కొంది. దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసులు 4,31,315గా ఉన్నాయని, 109 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు చేరాయని వివరించింది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 43,40,58,138 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 17,40,325 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.