Amaravati, Jan 6: ఏపీలో గడచిన 24 గంటల్లో 51,207 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 289 మందికి పాజిటివ్ (AP Covid Report) అని నిర్ధారణ అయింది.గత 24 గంటల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 42 కేసులు గుర్తించారు. చిత్తూరులో 40, విశాఖ పట్నంలో 40, తూర్పు గోదావరిలో 39, పశ్చిమగోదావరిలో 33, కడపలో 11, కృష్ణా జిల్లాలో 27, కర్నూలు జిల్లాలో 7, నెల్లూరు జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 2, శ్రీకాకుళం జిల్లాలో 8, విజయనగరం జిల్లాలో 9 కేసులు (Coronavirus) నమోదయ్యాయి.
అదే సమయంలో 428 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, ముగ్గురు (Covid Deaths) మరణించారు. కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,80,981కి చేరింది. 8,70,960 కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా2,896 మందికి చికిత్స కొనసాగుతోంది. ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 7,125కి చేరింది.
Here's AP Covid Report:
#COVIDUpdates: #COVID19 cases in the last 24 hours as on 06/01/2021 till 10 AM #APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/YfLQbva24z
— ArogyaAndhra (@ArogyaAndhra) January 6, 2021
దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,088 కరోనా కేసులు (Covid in India) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం పేర్కొంది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,03,74,932కు (Coronavirus in India) చేరాయి. కొత్తగా 21,314 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 99,97,272 మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది. మరో 264 మంది మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,50,114కు పెరిగింది.
ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 2,27,546 ఉన్నాయని ఆరోగ్యమంత్రిత్వశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. మంగళవారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 9,31,408 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 17,74,63,405 టెస్టులు నిర్వహించినట్లు వివరించింది.