COVID19 Outbreak in Andhra Pradesh | Photo: Pixaby/ Twitter

Amaravathi, May 23: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా మరో 47 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 2561 కు చేరింది. ఈరోజు కృష్ణా జిల్లా నుంచి మరొక కోవిడ్-19 పేషెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 56 కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 47 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 1778 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 727 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Here's the official update: 

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,136 సాంపిల్స్‌ని పరీక్షిస్తే 47 మంది కోవిడ్19 పాజిటివ్‌గా నిర్దారింపబడినట్లు అధికారులు తెలిపారు.  ఇందులో తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వారిలో మరో ఐదుగురికి పాజిటివ్ అని తేలింది. అవి చిత్తూరు నుంచి 3, నెల్లూరు 2 కేసులు నమోదయ్యాయి.

ఇవి కాక, ఇతర ప్రాంతాల నుంచి ఏపికి వచ్చిన వారిలో ఇప్పటివరకు 150 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారింపబడినట్లు తెలిపిన అధికారులు, వీరి సంఖ్యను ఏపి జాబితాలో కాకుండా  విడిగా చూపుతున్నారు.  ఇక జిల్లాల వారీగా కేసుల వివరాలను తెలిపే పట్టికను కూడా ఇటీవల కాలంగా అధికారులు వెల్లడించడం లేదు.

మరోవైపు, దేశంలో కరోనా పాజిటివ్ కేసులు శనివారం ఉదయం నాటికి 1,25,101 కు చేరగా ఇందులో 95 శాతానికి పైగా కేసులు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, న్యూ ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల నుంచే ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.