Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

Amaravati, Sep 30: ఏపీలో గడిచిన 24 గంటల్లో 71,806 నమూనాలు పరీక్షించగా 6,133 పాజిటివ్‌ కేసులు (Coronavirus In Andhra Pradesh) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,93,484 కు చేరింది. కోవిడ్‌ బాధితుల్లో కొత్తగా 48 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5828 కు (Coronavirus Deaths) చేరింది. ఒక్క రోజులోనే 7,075 మంది కోవిడ్‌ (Coronavirus) నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైరస్‌ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 6,29,211. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 58,445.

ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. తాజా పరీక్షల్లో 35,254 ట్రూనాట్‌ పద్ధతిలో, 36,552 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశామని వెల్లడించింది. మొత్తం ఇప్పటివరకు 58,06,558 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 11.94 శాతంగా ఉందని, ప్రతి 10 లక్షల జనాభాకు 1,08,737 మందికి కరోనా టెస్టులు చేస్తున్నామని వెల్లడించింది.

గడిచిన 24 గంటల్లో వివిధ జిల్లాల్లో నమోదయిన మరణాలు.. కొత్తగా చిత్తూరు 8, ప్రకాశం 6 , తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖలో ఐదుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలో నలుగురు చొప్పున మృతి చెందారు. కడపలో 3, కర్నూలు 2, నెల్లూరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున మృతి చెందారు.

పొగ లాగా ఉండే తుంపర్లతో కరోనా, పాటలు పాడటం, అరవడం ద్వారా కరోనా వ్యాప్తి, వర్జీనియా టెక్‌ వర్సిటీ పరిశీలనలో వెల్లడి, భౌతిక దూరం ఆరడుగులకంటే ఎక్కువ ఉండాలని సూచన

కరోనా వైర‌స్‌ కట్టడిలో ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. దేశంలోనే కరోనా పరీక్షలు అత్యధికంగా చేసిన రాష్ట్రం ఏపీ అని పేర్కొన్నారు.. 14 ల్యాబ్‌లు ఏర్పాటు చేసి రోజుకు సుమారు 70వేల పరీక్షలు చేస్తున్నారన్నారు. కోవిడ్‌-19పై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామ‌ని తెలిపారు.