Covid in AP: ఏపీలో 24 గంటల్లో 506 మందికి కోవిడ్ పాజిటివ్, ఐదుగురు మృతితో 7057కు చేరుకున్న మరణాల సంఖ్య, ప్రస్తుతం రాష్ట్రంలో 4966 యాక్టివ్‌ కేసులు
Coronavirus in India | File Image | (Photo Credits: PTI)

Amaravati, Dec 13: ఏపీలో కరోనా కేసులు (Covid in AP) తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 63,873 కరోనా పరీక్షలు నిర్వహించగా, 506 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 87,5531కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 613 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 863508 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

గత 24 గంటల్లో కరోనా బారినపడి చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మృతిచెందగా, ఇప్పటి వరకు 7057 (Covid Deaths) మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4966 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు 1,08,30,990 శాంపిల్స్‌ను పరీక్షించారు.

తెలంగాణలో కొత్తగా 573 కరోనా కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,77,724కి కరోనా కేసులు నమోదు కాగా 1,493 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 7,630 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2,68,601 మంది రికవరీ అయ్యారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 127 కరోనా కేసులు నమోదైయ్యాయి.

దేశంలో తాజాగా 30,254 కోవిడ్ కేసులు, 1,43,019కు చేరుకున్న మరణాల సంఖ్య, తెలంగాణలో తాజాగా 573 మందికి కరోనా, ఢిల్లీలో తగ్గుముఖం పడుతున్న కేసులు

దేశంలో గత 24 గంటల్లో 30,254 కొత్త కరోనా కేసులు (COVID-19 in India) నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98,57,029కు (Coronavirus Pandemic) చేరుకుందని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనావైరస్ కారణంగా కొత్తగా 391 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,43,019కు (Covid Deaths) చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కొత్తగా 33,196 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 93,57,464కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 94.93శాతానికి చేరింది. దేశంలో ప్రస్తుతం 3,56,546 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో మరణాల రేటు 1.45 శాతంగా ఉంది.