Amaravathi, June 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు భారీ మొత్తంలో వ్యాక్సిన్ చేరుకుంది. గన్నవరం విమానాశ్రయానికి గురువారం సుమారు తొమ్మిది లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ వచ్చింది, వీటిని వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాలకుతరలించారు. వ్యాక్సిన్ రాకతో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది.
వైరస్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఏపిలో సెకండ్ వేవ్ కరోనా నియంత్రణలోకి వస్తుంది. కోవిడ్ కేసులు తగ్గినా కూడా ఏమాత్రం రిలాక్స్ కావొద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, జూన్ 20 తర్వాత కర్ఫ్యూ కొనసాగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది, అయితే జూన్ 21 నుంచి మరిన్ని లాక్డౌన్ సడలింపులు కల్పించనున్నారు.
ఏపిలో నమోదైన కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,02,712 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 6,151 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 18,32,902కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 18,30,007గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1244 కోవిడ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరు జిల్లా నుంచి 937 కేసులు వచ్చాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:
గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 58 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 12,167కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 7,728 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 17,50,904 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 69,831 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో