Amaravati, June 16: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,01,544 పరీక్షలు నిర్వహించగా.. 6,617 కొవిడ్ కేసులు (Covid in Andhra Pradesh) నిర్ధారణయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,26,751 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 57 మంది బాధితులు (57 deaths) ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,109కి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 10,228 మంది బాధితులు (10,228 recoveries) కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,43,176కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 71,466 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,07,36,435 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1,397, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 217 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, గుంటూరులో కరోనాతో 9 మంది చొప్పున మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా, శ్రీకాకుళంలో ఐదుగురు చొప్పున మృతి చెందారు. విశాఖ, పశ్చిగగోదావని జిల్లాలో నలుగురు చొప్పున మృతి చెందారు. కర్నూలు జిల్లాలో ముగ్గురు, కడప, నెల్లూరు, ప్రకాశం, విజయనగరంలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.
మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ, అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చిందని సీఎం జగన్ తెలిపారు. కొవిడ్, ఉపాధిహామీ పనులు, అర్బన్ క్లినిక్స్, ఇళ్లపట్టాలు, ఖరీఫ్ సన్నద్ధతపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందని తెలిపారు. మాస్కులు, శానిటైజర్లు జీవితంలో భాగం కావాలని సూచించారు. గ్రామాల్లో ఫీవర్ సర్వే ప్రతి వారం కొనసాగాలని ఆదేశించారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేసి వైద్యం అందించాలన్నారు. కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ కింద 89 శాతం మంది తీసుకున్నారని జగన్ పేర్కొన్నారు.
Here's AP Covid Report
Andhra Pradesh reports 6617 new #COVID19 cases, 57 deaths, and 10,228 recoveries in the last 24 hours
Active cases 71,466
Case tally 18,26,751 pic.twitter.com/LmXbOh8HQ3
— ANI (@ANI) June 16, 2021
‘‘థర్డ్‌వేవ్ వస్తుందో, లేదో మనకు తెలియదు. వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. థర్డ్‌వేవ్‌లో పిల్లలు ప్రభావితం అవుతారని చెప్తున్నారు. ఈ అంశాలను కలెక్టర్లు దృష్టిలో ఉంచుకోవాలి. ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. పిల్లలకు చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. జిల్లాస్థాయిలో వచ్చే 2 నెలలకు కార్యాచరణ సిద్ధంచేసి అమలు చేయాలి. పిల్లల వైద్యంకోసం మూడు అత్యాధునిక ఆస్పత్రులను తీసుకొస్తున్నాం. అవసరమైన భూములను కలెక్టర్లు గుర్తించాలి’’ అని జగన్ సూచించారు.