Amaravati, Sep 13: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 9,536 కరోనా పాజిటివ్ కేసులు ( new corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 5,67,123కు (Andhra Pradesh Coronavirus) చేరింది. ప్రస్తుతం 95,072 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 4,67,139 మంది కోలుకున్నారు. ఒక్క రోజు వ్యవధిలో 66 మంది మరణించారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 4,912కు పెరిగింది. 24 గంటల్లో 10,131 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
గడిచిన 24 గంటల్లో అనంతపురం జిల్లాలో ఏడుగురు, నెల్లూరులో ఏడుగురు, ప్రకాశంలో ఏడుగురు, కడపలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, కర్నూలులో ఐదుగురు, గుంటూరులో నలుగురు, విజయనగరంలో నలుగురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
గత కొన్ని రోజులుగా డిశ్చార్జిలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరుగుతున్నాయి. తాజాగా, ఆదివారం 10,131 (COVID-19 Daily Bulletin) మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 5,67,123 పాజిటివ్ కేసులకు గాను, 4,67,139 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 95,072 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.