Amaravati, July 23: కొత్తగా నమోదయ్యే కొవిడ్ కేసులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన రికార్డులను తానే బద్ధలు కొట్టుకుంటుంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఒకరోజులో నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. గడిచిన 24 గంటల్లో కూడా భారీ స్థాయిలో 7,998 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒకరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అయితే రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా అంతే స్థాయిలో నిర్వహించడం గమనార్హం. గత 24 గంటల్లో 58,058 మంది సాంపుల్స్ పరీక్షించినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 72,711 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 69,816 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆరోగ్య ఆసరా కింద మహిళలకు రూ.5 వేల నగదు, వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణపై సీఎం జగన్ సమీక్ష
నిన్నటి నుండి ఈరోజు వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో కేసులు నమోదు కాగా, అనంతపూర్, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచైతే ఏకంగా వెయ్యికి మించి కేసులు నమోదయ్యాయి. కర్నూలు నుంచి కూడా దాదాపు ఇంతే స్థాయిలో కేసులు వచ్చాయి. జిల్లాల వారీగా ఒకరోజులో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య కింద పట్టికలో చూడవచ్చు.
AP's COVID Update:
రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా మరో 61 కరోనా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. పలు జిల్లాల నుంచి పదుల సంఖ్యలో కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 884 కు పెరిగింది
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 5,428 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 37,555 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 34,272 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.