Dubbak by-poll on November 3 (Photo-Facebook)

Amaravati, Nov 1: ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ (AP Local Body Polls 2021) విడుదలైంది. నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ దఫా 533 పంచాయతీ వార్డులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్‌ 14, 15,16 తేదీలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీలకు ఈ నెల 14న పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్‌ జరగనుంది.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈనెల 15న పోలింగ్‌, 17న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ నెల 16న పోలింగ్‌, 18న కౌంటింగ్‌ జరపనున్నారు. అన్ని స్థానిక సంస్థలకు ఈనెల 3 నుంచి 5 వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి రానుంది. అకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.