Andhra Pradesh: అనకాపల్లిలో అమ్మోనియం గ్యాస్ లీక్, అచ్యుతాపురం సెజ్‌లోని పోరస్‌ కంపెనీ నుంచి లీకైన గ్యాస్, పలువురికి అస్వస్థత, అచ్యుతాపురం గ్యాస్‌ లీకేజీ ఘటనపై సీఎం జగన్‌ ఆరా
Several hospitalised due to gas leakage at a SEZ in Achutharapuram in Anakapalli (Photo-Video grab)

Achutharapuram, June 3; అనకాపల్లి లోని అచ్యుతారపురంలో గ్యాస్‌ లీకేజీ ఘటన కలకలం రేపింది. సెజ్‌లోని పోరస్‌ కంపెనీ నుంచి అమ్మోనియం గ్యాస్‌ లీకైనట్టు (gas leakage at a SEZ in Achutharapuram) అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, తర తిరగడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. బాధితులను యలమంచిలి, అనకాపల్లి ప్రభుత్వాస్పత్రులకు (Several hospitalised) తరలించారు. 20 అంబులెన్స్‌లతో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్‌ రవి సుభాష్‌ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

అనకాపల్లి గ్యాస్ లీకేజీ ఘటనపై హోంమంత్రి తానేటి వనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో హోంమంత్రి సమీక్షించారు. సహాయ చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. గ్యాస్ పీల్చి ఇబ్బందిపడ్డ 32 మంది బాదితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, గ్యాస్‌ లీక్ అవుతున్న పరిశ్రమని అధికారులు కంట్రోల్ లోకి తీసుకోవాలని ఆదేశించారు.

సినిమా టికెట్ల అమ్మకాలపై సరికొత్త మార్గదర్శకాలు, విక్రయించే ప్రతి టికెట్ పై 2 శాతం సర్వీస్ చార్జీ వసూలు, థియేటర్లు ఏపీఎఫ్‌డీసీతో అగ్రిమెంట్ చేసుకోవాలని తెలిపిన ఏపీ ప్రభుత్వం

అమ్మోనియా గ్యాస్‌ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఘటనపై అధికారుల నుంచి వివరాలు కోరారు. ఘటనకు దారితీసిన కారణాలను సీఎంఓ అధికారులు వివరించారు. సంబంధిత జిల్లా కలెక్టర్‌ వెంటనే వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారని అధికారులు వెల్లడించారు. గ్యాస్‌ లీక్‌ను కూడా నియంత్రించారని అధికారులు తెలిపారు. బ్రాండిక్స్‌లో ఒక యూనిట్‌లో పనిచేస్తున్న మహిళలను అందరిని ఖాళీ చేయించామని, అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారని అధికారులు తెలిపారు. అంతా కోలుకుంటున్నారని, క్షేమంగా ఉన్నారని వివరించారు.

Here's Gas Leak Videos

అమ్మోనియా ఎక్కడ నుంచి లీకైందన్న అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారన్నారు. అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్యాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేసి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా స్థానిక మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను సీఎం ఆదేశించారు. వెంటనే ఆయన విజయవాడ నుంచి అనకాపల్లి బయల్దేరి వెళ్లారు.