
Guntur, May 3: గుంటూరు జిల్లాలో దారుణం (Andhra Pradesh Shocker) చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో కూలి పనులు చేసుకునే వ్యక్తి మర్మాంగాన్ని ప్రియురాలి కూతురు కోసిన ఘటన (Lover Daughter Attack on Man with knife) తెనాలిలో చోటు చేసుకుంది. టూ టౌన్ సీఐ బి. కోటేశ్వరరావు కథనం ప్రకారం.. చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెంకు చెందిన రామచంద్రారెడ్డి తెనాలిలో మడత మంచాలు అద్దెకు ఇచ్చే లాడ్జీలో ఉంటూ కూలి పనులకు వెళుతుంటాడు. ఇతనికి ఓ మహిళతో వివాహేతర సంబంధం (Extramarital Affair) ఏర్పడింది.
అప్పుడప్పుడు ఆమె ఇంటికి వెళ్లి ఇద్దరూ మద్యం సేవిస్తూ ఉంటారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లగా, ఇద్దరూ కలసి పూటుగా మద్యం సేవించారు. మేడపైన రామచంద్రారెడ్డి పడుకోగా, ఆమె కింద ఇంట్లోకి వెళ్లింది. అదే సమయంలో ఆమె కూతురు, మరో వ్యక్తి ఇంటికి వచ్చారు. తన తల్లితో వివాహేతర సంబంధంపై ఎప్పటి నుంచో ఆగ్రహంతో ఉన్న సదరు మహిళ కుమార్తె తన ప్రియుడితో కలిసి రామచంద్రారెడ్డితో గొడవ పడింది. ఈ క్రమంలోనే ప్రియుడి సహకారంతో రామచంద్రారెడ్డి మర్మాంగాన్ని (బీర్జాలను) బ్లేడుతో కోసేసింది. బాధితుడు పెద్దగా కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు అతన్ని స్థానికులు తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు.
మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. విషయం తెలుసుకున్న సీఐ వైద్యశాలకు వెళ్లి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.బాధితుడి స్వస్థలం చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం వాసిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.