Puttaparthi, Oct 2: అనతంపురం జిల్లా పుటపర్తి దగ్గర కొత్తచెరువు పట్టణంలోని షిర్డిసాయి క్లినిక్‌లో శుక్రవారం దారుణ ఘటన జరిగింది. జ్వరానికి చికిత్స కోసం వచ్చిన ఓ బాలికపై ఆర్‌ఎంపీ సహాయకుడు అత్యాచారానికి (nine year old girl molested in RMP clinic i) పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. షిర్డిసాయి క్లినిక్‌ను ఆర్‌ఎంపీ ఆదినారాయణ నిర్వహిస్తున్నాడు. కొత్తచెరువు మండలం ( kothacheruvu town Puttaparthi) కేశాపురం గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలికకు జ్వరంగా ఉండటంతో శుక్రవారం తల్లిదండ్రులు క్లినిక్‌కు తీసుకొచ్చారు.
ఆర్‌ఎంపీ ఆదినారాయణకు చూపించారు. ఆర్ఎంపీ పరీక్షించిన తర్వాత ఇంజక్షన్ వేయాలని సహాయకుడు జయరామ్‌కు సూచించాడు. సహాయకుడైన జయరామ్ బాలికను ఇంజక్షన్ గదిలోకి తీసుకెళ్లాడు. తల్లిని గది బయటకు వెళ్లాలని చెప్పాడు. వెంటనే రూము తలుపులు వేసి తర్వాత దుస్తులు తొలగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు కొత్తచెరువు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు జయరామ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు... పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పుట్టపర్తి రూరల్ సీఐ నరసింహారావు, కొత్తచెరువు ఎస్‌ఐ లింగన్న తెలిపారు. కాగా షిర్డిసాయి క్లినిక్‌లో అధిక డోస్ మందులు ఇవ్వడంతో గతంలో ముగ్గురు మృతి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆర్‌ఎంపీ సహాయకులు ముగ్గురు ఉండగా.. ఏ ఒక్కరికీ తగిన అర్హతలు లేవని తెలుస్తోంది. క్లినిక్‌లో ఏం జరిగినా డబ్బుతో మేనేజ్ చేస్తున్నారన్న కూడా విమర్శలున్నాయి.