![](https://test1.latestly.com/wp-content/uploads/2021/12/murder.jpg)
Anantapur, Nov 17: అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని ఆర్ట్స్ కళాశాల కామర్స్ లెక్చరర్ (Woman professor) సుమంగళిపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కామర్స్ డిపార్ట్‌మెంట్ నుంచి బయటకు వస్తున్న సుమంగళిపై భర్త పారేష్ కత్తితో దాడి (Attack with Knife) చేశాడు. మనస్పర్ధల కారణంగా భార్యాభర్తలు సుమంగళి, పారేష్ వేరువేరుగా నివాసం ఉంటున్నారు. గతంలో భర్త పారేష్‌పై సుమంగళి గృహహింస కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టులో విడాకుల కేసు వేశారు. ఆ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.
దీంతో సుమంగళిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పారేష్ ఆమెపై ఈ దాడికి పాల్పడ్డాడు. భర్త పారేష్ దాడిలో గాయపడిన సుమంగళిని తోటి లెక్చరర్లు చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.