
East Godavari, Mar 21: ఏపీలో తూర్పు గోదావరి జిల్లాలో దారుణం (Andhra Pradesh Shocker) చోటు చేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న చిన్నారిని కామాంధుడు కాటేశాడు. ద్రాక్షారామ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామచంద్రపురం మండలం కాపవరం గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువకుడు సత్యవాడ సత్యనారాయణ ఆదివారం కందులపాలెం గ్రామం నుంచి రెండు రోజుల క్రితం అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఆరేళ్ల బాలికను తినుబండారాలు కొనిపెడతానని బండి ఎక్కించుకుని తన ఇంటికి తీసుకుని వెళ్లాడు.
అక్కడ బాలిక నోట్లో దుప్పటి కుక్కి ఆమెపై అత్యాచారం (Youth assaults 6-year-old girl) చేశాడు. రక్తం కారుతున్న బాలికను కందులపాలెంలో రోడ్డుపై వదిలి పెట్టి వెళ్లిపోయాడు. స్థానికులు బాలికను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రామచంద్రపురం సీఐ వి.శ్రీనివాస్ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలిక స్వయంగా ఆయనతో జరిగిన ఘటన చెప్పడంతో పాటు ఎవరికైనా చెబితే చంపి కాలువలో పడేస్తానని బెదిరించినట్టు చెప్పడంతో సీఐ అవాక్కయ్యారు.
డీఎస్పీ బాలచంద్రారెడ్డి వచ్చి బాలిక పరిస్థితిని పరిశీలించారు. బాలికను మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ద్రాక్షారామ ఎస్సై ఎస్.తులసీరామ్ బాలిక బంధువుల నుంచి వివరాలు సేకరించారు. బాలిక తల్లితో మాట్లాడి నిందితుడిపై పోక్సో కేసు ( case filed under POCSO Act ) నమోదు చేయనున్నట్టు తెలిపారు.