Andhra Pradesh's Ex-Chief Minister N. Chandrababu Naidu. (Photo Credits: IANS)

Vjy, Feb 14: రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) తేల్చేశారు. బుధవారం ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో పలువురు పార్టీ ముఖ్యనేతలు సమావేశమైన టీడీపీ అధినేత రాజ్యసభ ఎన్నికల్లో (Rajya Sabha elections) పోటీ చేసే ఆలోచన లేదని నేతలకు తేల్చిచెప్పేశారు.చంద్రబాబు నిర్ణయంతో రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో పార్టీ స్థాపించినప్పటి నుంచి తొలిసారిగా రాజ్యసభలో టీడీపీ ఉనికి కోల్పోనుంది.

ఇక వైసీపీ ముఖ్యనేతలు టీడీపీకు టచ్‌లోకి వస్తున్నారని.. అలాగని ఆ పార్టీ నుంచి వచ్చిన అందరినీ తీసుకోలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. రా.. కదలిరా.., లోకేశ్‌ శంఖారావం సభలతో పాటు వివిధ రాజకీయ అంశాలపై వారితో చర్చించారు. పార్టీ నేతలు యనమల, నిమ్మల, అనగాని, గొట్టిపాటి, కంభంపాటి పాల్గొన్నారు.

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన జగన్ సర్కారు, వైవీ సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడా రఘునాథ రెడ్డి పేర్లు ఖరారు చేసిన వైసీపీ అధిష్ఠానం

పొత్తులు, చేరికల వల్ల పార్టీలో కష్టపడిన నేతలకు నష్టం జరగకూడదు. వారి భవిష్యత్తుకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. దానికే అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఎన్నికలకు అటుఇటుగా కేవలం 56 రోజులే ఉందని, పార్టీ నేతలు పూర్తిగా ఎలక్షన్ మూడ్‌‌లోకి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.