Representational Image (Photo Credits: ANI)

Chittoor August 9: ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. కంకర తరలిస్తున్న టిప్పర్‌కు విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి (Three members electrocuted) చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో (Chittoor district) చోటు చేసుకుంది. పాలసముద్రం మండలం కనికాపురంలో జరిగిన ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

వివరాల్లోకి వెళ్తే.. కనికాపురంలో ఇల్లు నిర్మించుకుంటున్న మునిస్వామి నాయుడు తన అవసరాల కోసం టిప్పర్‌లో కంకరు తెప్పించారు. కంకరను అన్‌లోడ్‌ చేసే సమయంలో విద్యుత్ తీగలు గమనించని డ్రైవర్ మనోజ్‌‌.. టిప్పర్ వెనక భాగం పైకెత్తాడు. ఈ క్రమంలో టిప్పర్‌కు విద్యుత్‌ తీగలు తగిలి కరెంట్‌ ప్రవహించింది. దీంతో డ్రైవర్‌ కేకలు వేశాడు. అతడిని కాపాడే క్రమంలో యువకులు జ్యోతీశ్వర్‌, దొరబాబు కూడా విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బీహార్‌‌లో ఆటోను ఢీకొన్న ట్రక్కు, ఐదుగురు అక్కడికక్కడే మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు, మరో రాష్ట్రం యూపీలో సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు బాలికలు మృతి

ఇక కర్నూలు జిల్లాలోని నంద్యాలలో యూట్యూబ్‌ ఛానల్‌ విలేకరి కేశవులను గుర్తు తెలియని దుండగులు కత్తులతో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నంద్యాలలోని ఎన్జీవో కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుట్కా వ్యాపారులతో కానిస్టేబుల్‌ సంబంధాల ఆడియోను కేశవులు బయటపెట్టాడు. దీంతో కేశవులుపై కానిస్టేబుల్ సుబ్బయ్య పగ పెంచుకుని హత్య చేయించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సుబ్బయ్య పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సుబ్బయ్యతో పాటు అతని తమ్ముడు నాని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

నంద్యాల రిపోర్టర్‌ హత్య కేసు: దర్యాప్తునకు డీజీపీ ఆదేశం

కర్నూలు జిల్లా నంద్యాలలో రిపోర్టర్ కేశవ్‌ హత్య ఘటనపై దర్యాప్తునకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశించారు. హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సస్పెండైన కానిస్టేబుల్‌తో పాటు హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ముద్దాయిలను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలలో యూట్యూబ్‌ చానల్‌ వీ5 విలేకరి కేశవను ఆదివారం రాత్రి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. పదేళ్లుగా విలేకరిగా పనిచేస్తున్న అతడిపై కక్షగట్టిన కానిస్టేబుల్‌ సుబ్బయ్య, అతడి సోదరుడు పదునైన ఆయుధంతో వీపు వెనుకభాగంలో పొడిచి హత్యచేసినట్లు అనుమానిస్తున్నారు.