Vijayawada, Feb 17: కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్-2 (vijayawada benz circle flyover 2 ) ప్రారంభించారు. కేంద్ర మంత్రి గడ్కరీతో పాటుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రారంభోత్సవానికి (vijayawada benz circle flyover 2 inauguration) విచ్చేశారు. ముందుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి రాష్ట్రప్రభుత్వం తరపున మంత్రి శంకర్ నారాయణ ,ఎంపీ బాలశౌరి స్వాగతం పలికారు. బీజేపీ తరపున ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు, బీజేపీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్ ,ఎమ్మెల్సీ మాధవ్ స్వాగతం పలికారు.
ప్రారంభోత్సవం అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (nitin gadkari) , ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో (CM YS Jagan) కలిసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధికి బాటలు వేసేందుకు రూ.10,401 కోట్లతో నిర్మించిన 31 రహదారుల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. రూ.11,157 కోట్లతో నిర్మించనున్న 20 రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ స్టేడియంతో నిర్వహించే బహిరంగ సమావేశంలో జగన్‌తో కలిసి ప్రసంగించనున్నారు. ఇందులో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చెందినవి 13 వేల 806 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందినవి 7 వేల 753 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు ఉన్నాయి.
ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
మధ్యాహ్నం 2.20 గంటల నుంచి 3.30 గంటల వరకు తాడేపల్లిలో జాతీయ రహదారి ప్రాజెక్టులపై గడ్కరీ సమీక్ష జరపనున్నారు. అనంతరం సీఎం నివాసంలో గడ్కరీ విందు చేయనున్నారు. మధ్యాహ్నం 3.20 నిమిషాలకు కనకదుర్గమ్మ ఆలయాన్ని గడ్కరీ సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 5.15 గంటల వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గడ్కరీని పార్టీ కార్యవర్గం ఘనంగా సత్కరించనుంది. సాయంత్రం 5.20 నుంచి 5.45 గంటల మధ్య గన్నవరం విమానాశ్రయం నుంచి నాగపూర్ కు గడ్కరీ బయల్దేరి వెళ్లనున్నారు.