
Vijayawada, August 18: ఏపీలోని విజయవాడలో ముగ్గురు స్నేహితుల మధ్య జరిగిన వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన వివాదం ముగ్గురు వ్యక్తుల సజీవ దహన యత్నానికి (Vijayawada Murder Attempt) కారణమైంది. బెజవాడ నోవాటల్ హోటల్ వద్ద కారుపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. వ్యాపారంలో జరిగిన డబ్బులు వ్యవహారమే (Vijayawada Real Estate Spat) హత్యాయత్నానికి ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు. సోమవారం సాయంత్రం విజయవాడ నోవాటెల్ సమీపంలోని భారతీనగర్‌లో జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.
పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. తాడేపల్లికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి, విజయవాడ వెటర్నరీ కాలనీకి చెందిన గంగాధర్, గాయత్రీనగర్‌కు చెందిన కృష్ణారెడ్డి స్నేహితులు. వీరంతా కలిసి వడ్డీ వ్యాపారంతోపాటు రియల్‌ఎస్టేట్, సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం నిర్వహించేవారు.ఈ నేపథ్యంలో ఏడాది క్రితం నాగమణి, గంగాధర్ దంపతులు, కృష్ణారెడ్డిలకు వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి రూ.2 కోట్లు అప్పుగా ఇచ్చాడు. అయితే అప్పుగా తీసుకున్న సొమ్మును ఇవ్వకుండా నాగమణి,గంగాధర్ దంపతులు,కృష్ణారెడ్డి కాలం వెళ్లుబుచ్చుతున్నారు. విశాఖకు కొత్త బాస్, ఆర్కే మీనా స్థానంలో బాధ్యతలు స్వీకరించిన మనీష్ కుమార్ సిన్హా, విశాఖ ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని తెలిపిన మాజీ సీపీ ఆర్కే మీనా
తాను ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వాలని వేణుగోపాల్‌రెడ్డి వారిద్దరిపై ఒత్తిడి తెస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో గంగాధర్‌కు చెందిన స్థలాన్ని విక్రయించి సొమ్ము తీసుకునేలా ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఒక రియల్‌ఎస్టేట్ వ్యాపారిని కలుద్దామని చెప్పి గంగాధర్, కృష్ణారెడ్డిలను సోమవారం సాయంత్రం నోవాటెల్ హోటల్ వద్దకు రప్పించాడు. వీరిద్దరితో పాటు గంగాధర్ భార్య నాగవల్లి కూడా కారులో వచ్చి నోవాటెల్ హోటల్ సమీపంలోని కెనరా బ్యాంక్ ముందు ఆపారు.
ఈ చర్చలు జరుగుతుండగానే పథకం ప్రకారం వేణుగోపాల్‌రెడ్డి ముందుగానే తన వెంట తీసుకువచ్చిన పెట్రోల్‌ను కృష్ణారెడ్డి, నాగవల్లి..గంగాధర్ దంపతులపై పోసి... అలాగే కారుపై పోసి నిప్పటించాడు. అనంతరం వేణుగోపాల్ రెడ్డి అక్కడ నుంచి పరారయ్యాడు. ఒంటిపై మంటలతో కారు నుండి బయటకు వచ్చి కృష్ణారెడ్డి ప్రాణాలు కాపాడుకోగా... కారు వెనుక సీట్లో కూర్చోవడంతో నాగవల్లి, గంగాధర్ దంపతులు స్వల్పగాయలతో బయటపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. డీసీపీ హర్షవర్ధన్‌రాజు (Deputy Commissioner of Police (DCP) Harshvardan Raju), ప్రమాదస్థలికి చేరుకుని ఘటనపై విచారించారు. ముగ్గురు బాధితులను స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చేర్పించారు.