Sunkara Pavani (Photo-Video Grab)

Kakinada, Oct 5: గత ఇరవై రోజులుగా రాజకీయ మలుపులు తిరుగుతూ వస్తున్న కాకినాడ మేయర్‌ మార్పు ఘట్టానికి మంగళవారం 12 గంటలకు తెరపడింది. కాకినాడ మేయర్‌పై టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసంలో (Voting for No-confidence motion) మేయర్‌ పావని, ఉపమేయర్‌-1 సత్తిబాబు ఓడిపోయారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 33 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్‌అఫీసియో సభ్యులతో కలిపి మొత్తం 36 ఓట్లు వచ్చాయి.

కాకినాడ మున్సిపల్‌ కౌన్సిల్‌లో (Kakinada Municipal Corporation) 44 మంది కార్పొరేటర్లు ఉండగా, మరో ముగ్గురు ఎక్స్‌ అఫిషియో సభ్యులున్నారు. అవిశ్వాస తీర్మానానికి కోరం 31 మంది ఉండాల్సి నేపథ్యంలో సమావేశానికి 43 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్‌అఫిషియో సభ్యులు హాజరయ్యారు. ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా మంత్రి కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, ఎంపీ వంగా గీత ఓటువేశారు. అయితే కోర్టు కేసు నేపథ్యంలో ఫలితాలను ప్రిసైడింగ్‌ అధికారి రిజర్వ్‌ చేశారు. కోర్టు తీర్పు తర్వాత ఫలితాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

దీనిపై కాకినాడ మేయర్ (Kakinada mayor ) స్పందించారు. అభివృద్ధికి తాను అడ్డుపడుతున్నాను అని తనపై అవిశ్వాసం ప్రవేశపెట్టారని...ఇది వాస్తవం కాదని టీడీపీ మేయర్ సుంకర పావని అన్నారు. తాను చేసిన అభివృద్ధి తప్ప రెండేళ్లలో వైసీపీ చేసింది ఏమీ లేదని తెలిపారు. ఒక మహిళను అయిన తనను గద్దె దించేందుకు సిటీ ఎమ్మెల్యే చంద్ర శేఖర్ రెడ్డి కంకణం కట్టుకున్నారన్నారు. తన వైపు ఉన్న పార్టీ కార్పొరేటర్లు కూడా వ్యతిరేకతతో వున్నారని... దానిపై అధిష్టానం క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్పారు. ‘‘నేను టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన మేరకు నా కార్యాచరణ ప్రకటిస్తాను’’ అని తెలిపారు. న్యాయ పరంగా గెలుపు తనదే అని....కోర్టు తీర్పు తనకు అనుకూలంగా ఉంటుందని మేయర్ సుంకర పావని పేర్కొన్నారు.

బీజేపీ-వైసీపీ మధ్యనే బద్వేల్ ఉప ఎన్నిక పోరు, పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ, జనసేన, కుటుంబ వారసత్వాన్ని బీజేపీ ప్రోత్సహించదని తెలిపిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

ఇక కాకినాడ నగర మేయర్‌ సుంకర పావనిపై అవిశ్వాస తీర్మాన సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు జరిగింది. ఇందులో మేయర్‌కు వ్యతిరేకంగా 36 ఓట్లు వచ్చాయి. వాటిలో 21 మంది టీడీపీ కార్పొరేటర్లు మేయర్‌కు వ్యతిరేకంగా ఓట్లు రావడం గమనార్హం. మరో 9 మంది టీడీపీ కార్పొరేటర్లు తటస్థంగా ఉండిపోయారు. దీంతో మేయర్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకున్నట్లయ్యింది. కాగా.. కొత్త మేయర్ ఎవరనేది ప్రకటించొద్దని ఇప్పటికే హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

కాకినాడ మేయర్‌పై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేయి పైకెత్తి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీత ఓటు వేశారు. ఇదిలా ఉంటే.. అధిష్టానం విప్ జారీ చేసినప్పటికీ టీడీపీ కార్పొరేటర్లు ధిక్కరించి మరీ ఓటు వేయడం గమనార్హం. కాగా.. మరికాసేపట్లో డిప్యూటీ మేయర్‌ కాలా సత్తిబాబుపై అవిశ్వాస తీర్మాన సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీశ అధ్యక్షత వహించనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్‌ 30న ఉపఎన్నికలు, తెలంగాణలోని హుజురాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ నియోజకవర్గాలకు బై పోల్స్, నవంబర్‌ 2న కౌంటింగ్‌

నాలుగేళ్ల పదవీకాలం పూర్తయిన అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను మార్చేందుకు గత ప్రభుత్వంలో చట్టం చేయడంతో ఈ ప్రక్రియను తెరపైకి తెచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున మెజారిటీ కార్పొరేటర్లు గెలుపొందారు. దీంతో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు టీడీపీకి దక్కాయి. తదనంతరం అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడంతో కాకినాడలో రాజకీయ సమీకరణలు మారాయి. 2017లో జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 50 డివిజన్లకుగాను 48 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. 32 టీడీపీ, 10 వైసీపీ, 03 బీజేపీ, 03 ఇండిపెండెంట్లు గెలుపొందారు.

అప్పట్లో ఇండిపెండెంట్‌లు అందరూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మేయర్‌ వ్యవహారశైలి నచ్చక కొందరు టీడీపీ కార్పొరేటర్లు విభేదించారు. ఈ పరిణామాలు తారస్థాయికి చేరి మొత్తం టీడీపీ కార్పొరేటర్లు మేయర్‌కు దూరమయ్యారు. రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నికల సమయంలో 21 మంది టీడీపీ కార్పొరేటర్లు తమను ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లుగా ప్రకటించాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.