Union Railways Minister Ashwini Vaishnaw. Credits: ANI

Amaravati, July 27: ఏపీకి కొత్త‌గా రైల్వే ప్రాజెక్టుల‌ను (Railway projects) ప్ర‌క‌టించ‌డం సాధ్యం కాద‌ని కేంద్ర ప్ర‌భుత్వం (Center) తేల్చి చెప్పింది. ఇందుకు రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హాయ నిరాక‌ర‌ణే కారణ‌మ‌ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ పార్ల‌మెంటు వేదిక‌గా కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

వైసీపీ ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి అడిగిన ప్ర‌శ్న‌కు ఇచ్చిన లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో కేంద్ర మంత్రి ఈ మేర‌కు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీకి రైల్వే ప్రాజెక్టులు కోరుతున్న ఎంపీ... రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఒప్పించి కేంద్రానికి స‌హ‌క‌రించేలా చేస్తే... ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ప్రాజెక్టులు అయినా త్వ‌రిత‌గ‌తిన పూర్తి అవుతాయ‌ని మంత్రి వివ‌రించారు.

నియోజకవర్గాల పెంపు, ఏపీలో 225, తెలంగాణలో 153 అసెంబ్లీ స్థానాలు, అయితే 2026 జనాభా లెక్కల వరకు వేచి చూడాలని తెలిపిన కేంద్రం

ఏపీలో ప్ర‌స్తుతం రూ.70 వేల కోట్ల‌కు పైగా విలువ క‌లిగిన రైల్వే ప్రాజెక్టుల ప‌నులు కొన‌సాగుతున్నాయ‌ని వైష్ణ‌వ్ తెలిపారు. కొత్త ప్రాజెక్టుల‌ను కాస్ట్ షేరింగ్ ప‌ద్ద‌తిన చేప‌డుతున్న‌ట్లు వెల్ల‌డించిన మంత్రి... ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ప్రాజెక్టుల‌కు ఏపీ త‌న వాటాగా రూ.1,798 కోట్లు ఇవ్వాల్సి ఉంద‌ని తెలిపారు. ఈ నిధుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆయ‌న ఆరోపించారు. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఏపీకి కొత్త‌గా రైల్వే ప్రాజెక్టుల‌ను ప్ర‌క‌టించ‌డం సాధ్యం కాద‌ని మంత్రి తేల్చి చెప్పారు.