Representtaional Image (Photo Credits: Pixabay)

East Godavari, August 21: ఏపీలో తూర్పుగోదావరిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువకుడు వైనతేయ వారధిపై నుంచి గోదావరిలో దూకి (Young man commits suicide ) గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొగలికుదురు గ్రామానికి (Mogalikuduru of East Godavari) చెందిన బిళ్ల సూర్యప్రతాప్‌ (22) విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన గ్రామానికే చెందిన యువతిని కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండే వారని స్థానికులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా ఆ యువతికి వేరే యువకుడితో పెళ్లి కుదిరింది. ప్రతాప్‌ను పెళ్లి చేసుకోవాలని అతడి కుటుంబ సభ్యులు కోరినప్పటికీ ఆ యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. పైగా నగరం పోలీస్‌ స్టేషన్‌లో యువతి తండ్రి ఫిర్యాదు కూడా చేశారు. సూర్యప్రతాప్‌తో తన కుమార్తె చేసిన చాటింగ్, అతడితో కలిసి ఉన్న ఫొటోలు డిలీట్‌ చేయాలని, తన కుమార్తె జోలికి రాకుండా చూడాలని కోరాడు. దీనిపై గురువారం రాత్రి పోలీసులు ప్రతాప్‌కు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అతడి సెల్‌ఫోన్‌ తీసుకుని ఫొటోలు, మెసేజ్‌లు డిలీట్‌ చేశారు.

వీడు అసలు భర్తేనా.. పిల్లల కళ్లముందే తల్లి గొంతు కోసి పరార్, పిల్లలు ఏడుస్తున్నా కరగని కసాయి తండ్రి, ఉప్పల్‌లో దారుణ ఘటన, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఈ నేపథ్యంలో ఆ యువతి ప్రేమ పేరుతో తనను మోసం (love failure ) చేసిందని, తన చావుకు ఆమె, ఆమె తండ్రి కారణమని సెల్‌లో మెసేజ్‌ చేసిన సూర్యప్రతాప్‌ పాశర్లపూడి బ్రిడ్జిపై సెల్‌ఫోన్‌ పెట్టి వైనతేయ గోదావరి నదిలో దూకేశాడు. అతడి ఆచూకీ కోసం నగరం ఎస్సై షేక్‌ జానీబాషా ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. వరద కారణంగా గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సూర్యప్రతాప్‌ ఆచూకీ తెలియరాలేదు. యువకుడి తండ్రి బిళ్ల గణపతిరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.