Andhra Pradesh: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌కు రెండేళ్ల వయస్సు సడలిస్తూ కీలక నిర్ణయం
YS Jagan Mohan Reddy (Photo-Twitter)

Amaravati, Dec 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌కు రెండేళ్ల వయస్సు సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వయో పరిమితి సడలింపునకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించారు. కానిస్టేబుల్‌ అభ్యర్థుల వినతి మేరకు సీఎం సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల చాలామంది ఈ ఉద్యోగాల కోసం పోటీ పడేందుకు అవకాశం లభిస్తోంది.

వయో పరిమితిని పెంచి తమకు కూడా అర్హత కల్పించాలంటూ కానిస్టేబుల్‌ ఉద్యోగార్థులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులపై సీఎం అధికారులతో సమావేశమయ్యారు. వారికి అవకాశం కల్పించేలా రెండేళ్లపాటు వయోపరిమితి పెంచుతూ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.కాగా రాష్ట్ర ప్రభుత్వం 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. వాటిలో 411 ఎస్‌ఐ పోస్టులు, 6,100 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు ఏపీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

పోలవరంపై కేంద్రం శుభవార్త, రూ.5,036 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు సీడబ్ల్యూసీ సిఫార్సు

ఎస్‌ఐ పోస్టుల్లో 315 సివిల్‌ (పురుషులు, మహిళల కేటగిరీలు), 96 ఏపీఎస్పీ (పురుషులు) పోస్టులు ఉన్నాయి. 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల్లో 3,580 సివిల్, 2,520 ఏపీఎస్పీ పోస్టులు ఉన్నాయి. ఎస్‌ఐ పోస్టుకు రెండు విభాగాల్లో (సివిల్, ఏపీఎస్పీ) దరఖాస్తు చేసేవారికి ఒక దరఖాస్తు సరిపోతుంది