Andhra Pradesh: వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, అక్టోబర్ 1 నుంచి పథకాలు అమల్లోకి..
YS Jagan Mohan Reddy (Photo/Twitter/APCMO)

Amaravati, Sep 30: ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వైఎస్సార్ కళ్యాణమస్తు’’, ‘‘వైఎస్సార్ షాదీ తోఫా’’ పథకాలు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. వీటికి సంబంధించిన వెబ్ సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒకరోజు ముందుగానే.. అంటే సెప్టెంబర్‌ 30న లాంఛనంగా ప్రారం‍భించారు.

వైఎస్సార్ కళ్యాణమస్తు’’, ‘‘వైఎస్సార్ షాదీ తోఫా’’ పథకాలు దరఖాస్తు చేసుకునే వధూవరులిరువురుకీ టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలి. చదువును ప్రొత్సహించేందుకే ఈ నిబంధనను తప్పనిసరిని చేసింది ప్రభుత్వం. ఇక వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు ఖచ్చితంగా నిండాలని ప్రభుత్వం తెలిపింది.

పెట్టుబడుల ఆకర్షణలో దేశంలో నంబర్ వన్‌గా ఏపీ, 2022లో మొదటి ఏడు నెలల్లో రూ. 40,361 కోట్ల పెట్టుబ‌డులు

వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అర్హులకు ఆర్థిక సాయం భారీగా పెంచింది. వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తులో భాగంగా ఎస్సీలకు రూ.1,00,000, ఎస్సీల కులాంతర వివాహాలకు రూ.1,20,000, ఎస్టీలకు రూ.1,00,000, ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1,20,000, బీసీలకు రూ.50,000, బీసీల కులాంతర వివాహాలకు రూ.75,000, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద.. ముస్లిం మైనారిటీలకు రూ.1,00,000, దివ్యాంగుల వివాహాలకు రూ.1,50,000, వీళ్లకేగాక భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు రూ.40,000 ల ఆర్థిక సాయాన్ని పెళ్లి కానుకగా అందించనుంది.