Amaravati, Oct 18: పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల సమావేశంలో మంగళవారం మాట్లాడారు. నా** అంటూ రాయలేని భాషలో బూతులు వల్లించారు. పొలిటికల్ లీడర్ అనే స్పృహ లేకుండా.. ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్స్ (Pawan Kalyan ABusing Comments ) చేశారు. దీనిపై వైసీపీ నేతలు (Pawan Kalyan vs YSRCP) స్పందించారు. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నుంచి వెనువెంటనే ఎదురు దాడి మొదలైపోయింది. ఇప్పటికే ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు... పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ... పవన్ ముమ్మాటికీ ప్యాకేజీ స్టారేనని స్పష్టం చేశారు.
తాజాగా ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కూడా పవన్ వ్యాఖ్యలపై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. పవన్ తాజా వ్యాఖ్యలతో దత్తపుత్రుడి ముసుగు తొలగిందని నాని వ్యాఖ్యానించారు. దత్తపుత్రుడి ముసుగు వెనుక చంద్రబాబు ఉన్నాడని తేలిపోయిందని కూడా నాని అన్నారు. పవన్ ప్రసంగం ముగిసినంతనే మంగళవారం మీడియా ముందుకు వచ్చిన పేర్ని నాని.. పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూనే... పవన్ పై ఎదురు దాడికి దిగారు.
దత్తపుత్రుడిగా మారిన పవన్... సన్నాసిన్నర సన్నాసిగా కూడా మారిపోయారని ఆయన సెటైర్లు సంధించారు. తన పార్టీకి కాకుండా మరో పార్టీకి ఓటేయమని చెప్పే నేతను ప్యాకేజీ స్టార్ అనకుండా ఇంకేమంటారని నాని అన్నారు. సోదరా అంటేనే పవన్ కడుపు రగిలిపోతే... వైసీపీలోని కాపు ఎమ్మెల్యేలను నా కొడకల్లారా అంటే తమకు కడుపు మండదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను పట్టుకుని నా కొడకల్లారా అనేంత బలుపు పవన్ ది అని ఆయన ధ్వజమెత్తారు. పవన్ కు అంత బలుపెందుకు? అని నిలదీశారు.
తాను ఇంతవరకు పవన్ కల్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అనలేదన్న నాని... తమ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఆ మాట అన్నారన్నారు. అయితే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులను నిలిపితే... పవన్ ను ప్యాకేజీ స్టార్ అన్న అందరి తరఫున తానే క్షమాపణ చెబుతానన్నారు. ఇవాల్టీ నుంచి రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారుతుందని పవన్ ప్రకటించారంటే...జనసేన తిరిగి టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లేనన్నారు. అందులో భాగంగా బీజేపీకి కూడా గుడ్ బై చెప్పేశారని నాని అన్నారు.
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు: తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన సందర్భంగా ఆయన పవన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ను తాము ఆది నుంచి ప్యాకేజీ స్టారేనని చెబుతున్నామని, ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నామని ఆయన అన్నారు. పవన్ ముమ్మాటికీ ప్యాకేజీ స్టారేనని అంబటి అన్నారు.
వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వనని చెప్పిన పవన్... చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకునే ఈ మాట మాట్లాడారని అంబటి అన్నారు. ఈ విషయం రాజకీయ పార్టీలతో పాటు సామాన్య జనానికి కూడా అర్థమైపోయిందని కూడా ఆయన అన్నారు. ఓ రాజకీయ పార్టీ నేతగా ఎవరైనా తాను పదవిలోకి రావాలని కోరుకుంటారు తప్పించి... ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తానని చెప్పే నేతను పవన్ ను మాత్రమే చూస్తున్నామని ఆయన ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలతో పవన్ ప్యాకేజీ స్టార్ కాకుండా సొంత స్టారా? అని కూడా అంబటి అన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి వచ్చే వ్యక్తి కాదని ఆయన తేల్చి చెప్పారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్: జనసేన అధినేన పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. తాజాగా అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌కు అంత సీన్ లేదు. ప్యాకేజీ కోసం బాబు బాధ్యతను మోస్తున్న వ్యక్తి పవన్. వచ్చే ఎన్నికల్లో పవన్ తాను పోటీ చేసే సీటులో గెలవాలి. అప్పుడప్పుడు వచ్చి టీడీపీ స్క్రిప్ట్ చదివి వెళ్లిపోతాడు. వచ్చే ఎన్నికల్లో బాబు, పవన్ కట్టకట్టుకుని రండి. అయ్యా పీకే.. నువ్వేమీ పీకలేవు. అప్పుడప్పుడు సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్‌లు, ఓపెనింగ్ షాట్‌లు, క్లైమాక్స్ పంచ్ డైలాగులు తప్ప నువ్వేమీ పీకలేవు’ అంటూ కామెంట్స్ చేశారు.
మంత్రి జోగి రమేష్: జనసేన అధినేన పవన్ కల్యాణ్‌కు సినిమా షూటింగ్స్ లేనట్టున్నాయి. అందుకే మంగళగిరిలో ఉండి చంద్రబాబు ఏం చెబితే అదే పవన్ నోటి వెంట వస్తుందోంటూ మంత్రి జోగి రమేష్ ఫైరయ్యారు. కాగా, మంత్రి జోగి రమేష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రజలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే తల కల సాధ్యమవుతుందని నమ్మారు. అందుకే విశాఖ గర్జనను విజయవంతం చేశారు. అది తట్టుకోలేకనే జనసేన బ్యాచ్ సైకోల్లా వ్యవహరించారు. మంత్రులపై ఏవిధంగా దాడులు చేశారో ప్రజలందరూ చూశారు. టీడీపీ, జనసేన పార్టీలు హింసను ప్రోత్సహిస్తున్నాయి.
పవన్ కల్యాణ్‌కు సినిమా షూటింగ్స్ లేవనుకుంటా.. అందుకే మంగళగిరిలో ఉండి చంద్రబాబు ఏం చెబితే అదే మాట్లాడుతున్నాడు. పవన్‌కు 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులు దొరక్కపోవడంతో ఏడుస్తున్నాడు. ముందు ముసుగులు తీసి మాట్లాడటం నేర్చుకోండి. మొసలి కన్నీరు కార్చడం మానుకోండి. ఎన్ని సార్లు పొత్తు పెట్టుకుంటారు. ఎన్నిసార్లు విడాకులు తీసుకుంటారు. సింగిల్‌గా పోటీ చేస్తావో.. చంద్రబాబుతో కలిసి వస్తావో నువ్వే చెప్పాలి. పవన్ నువ్వు.. బీజేపీ, బాబుతో కలిసొచ్చినా సాధించేదేమీ లేదు అంటూ కామెంట్స్ చేశారు.
వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పొలిటికల్ బ్రోకర్ లా విన్యాసాలు చేస్తున్నాడని, చంద్రబాబు స్నేహంతో పవన్‌కి కూడా మతిమరుపు రోగం వచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులకు ఓకే చెప్పిన నోటితోనే నేడు పవన్ వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నాడని గుర్తు చేశారు మంత్రి కాకాణి. మంగళవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి కాకాణి.. పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరో కావొచ్చు కానీ, రాజకీయాల్లో జీరో అంటూ దుయ్యబట్టారు.
‘ప్యాకేజీల పవన్‌గా రాష్ట్ర ప్రజలు ఎప్పుడో గుర్తించారు. ఒక్కచోట కూడా ఆయనని ప్రజలు గెలిపించలేదు. నారా వారి రాజ్యాంగంలో విశాఖ ఎయిర్‌పోర్టులోనే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్‌ని పోలీసులు అడ్డుకొన్నారు. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం అమలులో ఉండబట్టే పవన్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. చంద్రబాబుకి సుపుత్రుడిపై నమ్మకం లేదు. దత్తపుత్రుడిని అడ్డం పెట్టుకొని లబ్ధిపొందాలని చూస్తున్నాడు..
2024లో కుప్పంలో కూడా చంద్రబాబుకి ఓటమి తప్పదు. చంద్రబాబు, పవన్ లాలూచీ వల్ల ఒరిగేదేమీ లేదు. వారి మధ్య రహస్య ఒప్పందం జగమెరిగిన సత్యం. సంక్షేమ సారథి వైఎస్ జగన్‌ని విమర్శించే అర్హత పవన్‌కి లేదు. జగన్ ప్రభంజనానికి చంద్రబాబు అడ్రస్ గల్లంతైపోయింది. రాజకీయ ఓనమాలు రాని నువ్వు గాలికి కొట్టుకుపోతావు. పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం హాస్యాస్పదం. పొరపాటు చేస్తే ఎవరినీ విడిచి పెట్టం.’ అని హెచ్చరించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ రాజ్యాంగానికేమైనా అతీతుడా అంటూ ప్రశ్నించారు. సీఎం కావాలని పగటి కలలు కంటే సరిపోదని, హుందాగా వ్యవహరించి మర్యాద కాపాడుకోవాలని సూచించారు.