Kodali Nani (Photo-Video Grab)

Amaravati, August 22: తెలంగాణలోని మునుగోడు బీజేపీ సభలో​ పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదివారం తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, పర్యటనలో భాగంగా అమిత్‌ షా.. నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. వీరి భేటీలో (Amit Shah, NTR meeting) రాజకీయ అంశాలు చర్చకు రాలేదని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఇది కేవలం RRR సినిమా గురించి అని తెలిపింది. అయితే ఇప్పటికే పలువురు.. ఇది పొలిటికల్‌ మీట్‌ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని (YSRCP MLA Kodali nani) అమిత్‌ షా, జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీపై స్పందించారు. కొడాలి నాని సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కారణాలు లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ, హోం​ మంత్రి అమిత్‌ షా ఎవరితోనూ మాట్లాడరు. బీజేపీని విస్తరించేందుకే అమిత్‌ షా.. జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిశారని నేను భావిస్తున్నాను. ఎన్టీఆర్‌తో దేశమంతా ప్రచారం చేయించే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రయోజనం లేదనే.. మోదీ, అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు’’ అని నాని కామెంట్స్‌ చేశారు.