Amaravati, October 15: కొవిడ్19 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రమంగా కోలుకుంటోంది, టెస్టుల సంఖ్యలో ఎలాంటి మార్పు లేకపోయిన కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్యలో స్థిరమైన తగ్గుదల కనిపిస్తోంది. ఒకటి, రెండు జిల్లాలు మినహా దాదాపు అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 7.71 లక్షలు దాటినా, ఆక్టివ్ కేసులు 40 వేలలోనే ఉండటం ఊరట కలిగించే విషయం.
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 73,767 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 4,038 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 7,71,503కు చేరింది.
అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 7,68,608 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా పాజిటివ్ కేసులు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 686, తూర్పు గోదావరి జిల్లా నుంచి 548, చిత్తూరు జిల్లా నుంచి 489 మరియు కృష్ణా జిల్లా నుంచి 421 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:
గడిచిన ఒక్కరోజులో మరో 38 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 6357కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 5,622 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 7,25,099 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 40,047 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.