 
                                                                 తిరుపతి నగరంలోని ఎస్వీ జూపార్క్ లో మరో పులికూన మృతి చెందింది. రెండు రోజుల కిందట అది చనిపోయిందని జూ నిర్వాహకులు ప్రకటించారు. రెండు నెలలు క్రితం నంద్యాల జిల్లా అటవీ ప్రాంతం నుంచి తల్లికి దూరమైన 4 పులి పిల్లలు ఇక్కడికి తరలించిన సంగతి తెలిసిందే.జూకి తరలించిన కొన్నిరోజులకే ఒక కూన మృతి చెందగా, తాజాగా ఈ నెల 29వ తేదీన మరొకటి చనిపోయింది.
కిడ్నీ,లివర్ సమస్యతో బాధపడుతూ ఈ పులికూన మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఇక.. బ్లడ్ శాంపిల్స్ తో మిగిలిన పులి కూనలకు పరీక్షలు చేస్తున్నారు అధికారులు. నంద్యాల అడవుల్లో తల్లి నుంచి తప్పిపోయిన పులికూనలు.. సమీప గ్రామంలోకి ప్రవేశించాయి. అయితే గ్రామస్తులు వాటిని రక్షించగా.. తల్లి చెంతకు చేర్చేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. దీంతో.. చివరకు వాటిని జూకి తరలించారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
