Representational Image (File Photo)

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది విద్యాశాఖ. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్షలనూ మార్చిలోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం మధ్యాహ్నాం ఆయన విజయవాడలో పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేశారు.

‘‘సాధారణ ఎన్నికలు ఏప్రిల్‌లో ఉండనున్నాయి. టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులు కలిపి 16 లక్షల మంది(టెన్త్లో 6 లక్షలు, ఇంటర్లో‌ 10 లక్షలు) మంది పరీక్షలు రాయబోతున్నారు. అందుకే విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే మార్చిలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12గం.45ని. వరకు పరీక్షల సమయంగా నిర్ణయించాం.

వచ్చే ఏడాదికి సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, మొత్తం 27 సాధారణ సెలవులతో పాటు 25 ఐచ్చిక సెలవులు

మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులందరూ పాసై 100 శాతం సక్సెస్‌ సాధించాలని ఆశిస్తున్నాం’’ అని మంత్రి బొత్స అన్నారు.

AP 10th Exam Date 2024

మార్చ్ 18న ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1

మార్చ్ 19 న సెకండ్ లాంగ్వేజ్

20 న ఇంగ్లీష్, 22 తేదీ లెక్కలు, 23 న ఫిజికల్ సైన్స్, 26 న బయాలజీ, 27 న సోషల్ స్టడీస్ పరీక్షలు

28 న మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1

30 న ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష

ఏడు సబ్జెక్ట్ లకే టెన్త్ పరీక్షలు నిర్వహణ

AP Inter Exam Date 2024

ఇంటర్ ఫస్టియర్ షెడ్యూల్

మార్చ్ 1 న సెకండ్ లాంగ్వేజ్ -1,

మార్చ్ 4 న ఇంగ్లీష్ పేపర్ -1,

6 న లెక్కలు పేపర్ 1 A, బోటనీ -1, సివిక్స్-1 ,

9 న లెక్కలు పేపర్ 1B, జువాలజీ-1, హిస్టరీ-1,

12 న ఫిజిక్స్ -1, ఎకనామిక్స్ -1

14 న కెమిస్ట్రీ-1, కామర్స్-1,సోషయాలజీ-1,ఫైన్ ఆర్ట్స్,మ్యూజిక్ -1

16 న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, లాజిక్ పేపర్ -1, బ్రిడ్జి కోర్సు లెక్కలు-1 ( బైపిసికి)

మార్చ్ 19 న మోడర్న్ లాంగ్వేజ్- 4, జాగ్రఫీ- 1

ఇంటర్ సెకండియర్ షెడ్యూల్

మార్చ్ 2 న సెకండ్ లాంగ్వేజ్ -2,

మార్చ్ 5 న ఇంగ్లీష్ పేపర్ -2,

7 న లెక్కలు పేపర్ 2 A, బోటనీ -2, సివిక్స్-2 ,

11న లెక్కలు పేపర్ 2B, జువాలజీ-2, హిస్టరీ-2,

13న ఫిజిక్స్ -2, ఎకనామిక్స్ -2

15 న కెమిస్ట్రీ-2, కామర్స్-2,సోషయాలజీ-2,ఫైన్ ఆర్ట్స్,మ్యూజిక్ పేపర్-2

మార్చ్ 18 న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, లాజిక్ పేపర్ -2, బ్రిడ్జి కోర్సు లెక్కలు-2 ( బైపిసికి)

మార్చ్ 20న మోడర్న్ లాంగ్వేజ్- 2, జాగ్రఫీ- 2