AP Assembly Session 2023: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా, జీపీఎస్, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్‌తో సహా పలు కీలక బిల్లులకు ఆమోదం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయిదోరోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సభలో పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ఇక శాసన మండలిలో పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి.
Vjy. Sep 27: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయిదోరోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సభలో పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ఇక శాసన మండలిలో పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ఆంధ్ర ప్రదేశ్ సివిల్ కోర్ట్స్ (అమెండ్మెంట్) బిల్లు-2023, ఆంధ్రప్రదేశ్ గ్యారెంటీ పెన్షన్ సిస్టమ్ బిల్లు- 2023, ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సెకండ్ అమెండ్మెంట్ బిల్లు -2023, ఆంధ్రప్రదేశ్ రెగ్యులైజేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ బిల్లు-2023, ఆంధ్ర ప్రదేశ్ అప్రాప్రియేషన్ నెంబర్ -3 బిల్లు -2023 ఆమోదం పొందాయి.
ఏపీ అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ బిల్లుకు సభ ఆమోదం తెలపగా, జీపీఎస్ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సభ ఆమోదం పొందింది.దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయ్యే నాటికి ఉన్న బేసిక్ పేలో 50 శాతం గ్యారెంటీ పెన్షన్ ఇవ్వనున్నట్లు మంత్రి బుగ్గన తెలిపారు. పింఛనుదారు మరణిస్తే భార్య లేదా భర్తకు ఆ పింఛన్‌లో 60 శాతం గ్యారెంటీ పొందవచ్చాన్నారు. ప్రభుత్వ ఉద్యోగి వార్షిక ఆదాయంలో తగ్గుదల ఉంటే నెలకు రూ.10 వేలు కనీస పింఛన్ భరోసా కల్పిస్తామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలుచేస్తామన్నారు.
వాలంటరీ రిటైర్మెంట్ కు కనీసం 20 ఏళ్ల సర్వీస్ చేసి ఉండాలని బిల్లులో నిబంధన పెట్టామని మంత్రి బుగ్గన తెలిపారు. సర్వీస్ మధ్యలో రాజీనామా చేస్తే పథకం వర్తించదు. క్రమశిక్షణా చర్యలు, బర్తరఫ్ లాంటి సందర్భాల్లో ఈ పథకం వర్తించదన్నారు. జీపీఎస్‌తో ప్రభుత్వంపై రూ.2500 కోట్ల అదనపు భారం పడుతుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఆశా వర్కర్లకు గతంలో రూ.3 వేలు మాత్రమే ఇచ్చేవారనీ, వైసీపీ ప్రభుత్వంలో వీరి జీతాలను రూ.10 వేలకు పెంచామన్నారు. 108 డ్రైవర్లకు జీతాలు పెంచామని, ప్రతి విభాగానికి మేలు చేశామని మంత్రి బుగ్గన అన్నారు.
(The above story first appeared on LatestLY on Sep 27, 2023 06:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

